calender_icon.png 28 February, 2025 | 10:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉపాధి హామీ కూలీల సంఖ్యను పెంచాలి

28-02-2025 05:55:21 PM

జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగువాన్...

కామారెడ్డి (విజయక్రాంతి): ఉపాధి హామీ కూలీల సంఖ్య పెంచాలని, పనులు మంజూరై ప్రారంభించని వాటిని కన్వర్ట్ చేస్తూ సీసీ రోడ్లు నిర్మించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. శుక్రవారం అధికారులతో కలిసి మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం, సమగ్ర కుటుంబ సర్వే, గ్రామీణ ప్రాంతాల్లో పన్నుల వసూళ్లు, ఎల్.ఆర్.ఎస్., త్రాగునీటి సౌకర్యాలు, ఇందిరమ్మ ఇండ్లు అంశాలపై ఎంపీడీఓ లు, తహసీల్దార్లు, ఎంపీఒ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... ఉపాధిహామీ పథకంలో కూలీల సంఖ్య పెంచాలని అన్నారు. కనీసం రోజుకి ప్రతీ గ్రామ పంచాయతీలో 50 మంది కూలీలు పనిచేసే విధంగా ప్రోత్సహించాలని తెలిపారు.

ఇప్పటివరకు పనులు మంజోరై పనుకున్ప్రారంభించని వాటిని కన్వర్ట్ చేస్తూ సిసి రోడ్లు నిర్మించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని, మంజూరైన పనులు ప్రారంభించి ఈ ఆర్థిక సంవత్సరం మార్చి 31 లోగా పనులు పూర్తిచేయని వాటిని కూడా కన్వర్ట్ చేసి సిసి రోడ్లు నిర్మించాలనీ సూచించారు. సమగ్ర కుటుంబ సర్వే ఈ రోజు వరకు వచ్చిన వాటిని ఆన్ లైన్ లో పొందుపరచాలని తెలిపారు.  ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే లోగా పెండింగులో నున్న ఏరియార్స్, రెగ్యులర్ పన్నులు వసూలు చేయాలని తెలిపారు. ఎల్.ఆర్.ఎస్. కేంద వచ్చిన దరఖాస్తులను పరిశీలించి చర్యలు చేపట్టాలని తెలిపారు. జిల్లాలో త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని తెలిపారు. దినపత్రికల్లో వచ్చే వ్యతిరేక వార్తలకు రిజాయిండర్ జారాచేయాలని తెలిపారు. త్రాగునీటి సమస్యలు రాకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని తెలిపారు.

ప్రైవేటు అద్దె బోరుబావులు సిద్ధం చేసుకోవాలని సూచించారు. గ్రామ పంచాయతీ ట్రాక్టర్లను త్రాగునీటి సరఫరాకు అత్యవసర పరిస్థితులలో వినియోగించు కోవాలని తెలిపారు. ఓపెన్ బావుల్లో కోరినేషన్ చేయించాలని తెలిపారు. బోరుబావులు మరమ్మతులు చేయడానికి ఒక ఫిట్టర్ ను గ్రామ పంచాయతీ నిధులతో ఎంగేజ్ చేయాలని సూచించారు. రెసిడెన్షియల్ పాఠశాలలు, వసతి గృహాల్లో త్రాగునీటి సమస్యలు రాకుండా చూడాలని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల మంజూరుకు లబ్ధిదారుల జాబితాలను ఎంపీడీఓ లు పరిశీలించి పంపించాలని తెలిపారు. ప్రతీ మండలంలో  ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణాలకు నిధులు మంజూరు చేయడం జరిగిందని, వాటిని త్వరగా నిర్మించాలని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో సబ్ కలెక్టర్ కిరణ్మయి, అదనపు కలెక్టర్లు వి.విక్టర్, శ్రీనివాస్ రెడ్డి, ఆర్డీఓ ప్రభాకర్, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ రావు, జడ్పీ సీఈవో చందర్, సిపిఓ రాజారాం, మున్సిపల్ కమీషనర్ లు, ఎంపీడీఓ లు, తహసీల్దార్లు, ఎంపీఒలు, తదితరులు పాల్గొన్నారు.