calender_icon.png 1 January, 2025 | 11:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉపాధి కూలీల లెక్కే కీలకం

30-12-2024 02:27:31 AM

  1. తెరమీదకు ‘రైతుభరోసా’ పథకం
  2. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలోని హామీపై చర్చ
  3. అసెంబ్లీ ఎన్నికల ముందు  రైతులతో పాటు కూలీలకూ ఆర్థికసాయం చేస్తామని ప్రకటన
  4. పరిగణలోకి ఉపాధి హామీ జాబ్ కార్డులు ?
  5. పథకం అమలుపై ముమ్మర కసరత్తు

హైదరాబాద్, డిసెంబర్ 29 (విజయక్రాంతి): రైతుభరోసా.. ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా రైతులు ఎక్కువగా ఈ పథకం గురించే మాట్లాడుతున్నారు. గ్రామీణ ప్రాం తాల్లో పథకం హాట్ టాపిక్‌గా మారింది. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో ‘రైతుభరోసా’ పథకాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే.

దీనిలో భాగంగా ఒక్కో రైతుకు ఏడాదికి ఎకరానికి రూ.15 వేల చొప్పున పెట్టుబడి సాయం, ఒక్కో రైతు కూలీకి రూ.12 వేల చొప్పున సాయం అందిస్తామని ప్రకటించింది. పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత ప్రభుత్వం ‘రైతుభరోసా’ అమలుపై కసరత్తు ప్రారంభించింది. సంక్రాం తి నుంచే పథకాన్ని అమలు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నది.

అర్హులై న రైతులను గుర్తింంచేందు కు పాస్‌బుక్ అనే ఆధారాన్ని చూసి గుర్తించవచ్చు. పథకం వర్తింపునకు ప్రభుత్వం కొన్ని నియంత్రణ లూ తీసుకొచ్చే యోచనలో ప్రభుత్వం ఉన్న ది. సాగులో ఉన్న భూమికి మాత్రమే పథ కం వర్తింపజేస్తుందని తెలిసింది.మరో వైపు పథకానికి అర్హుడైన కూలీని ఎలా గుర్తించాలనే ప్రశ్న ఇప్పుడు మొదలైంది. అర్హులైన కూలీలను గుర్తించేందుకు ఉపాధి పథకాన్నే ఆధారం చేసుకుంటుందని తెలిసింది.

58 లక్షల మంది ‘ఉపాధి’ కూలీలు..

ఉపాధి కొరత, అనావృష్టి, కరువు పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని, గ్రామీణ ప్రాం తాలకు చెందిన నిరుపేద కూలీలకు ఉపాధి కల్పించేందుకు 2005లో నాటి ప్రభుత్వం దేశవ్యాప్తంగా జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించింది. అప్పటి నుంచి ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా పథకం అప్రతిహతంగా కొనసాగుతున్నది.

పథకం ద్వారా జాబ్‌కార్డు కలిగి ఉన్న కూలీలకు ఏడాదిలో వంద రోజులకుపైగా ఉపాధి లభిస్తున్నది. అయితే.. ఉపాధి హామీ జాబ్‌కా ర్డుపై ఇప్పుడు తెలంగాణవ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ గణాంకాల ప్రకారం.. పథకం పరిధిలో రాష్ట్రవ్యాప్తంగా 53 లక్షలకుపైగా కుటుంబాలు ఉండగా, ఆయా కుటుంబాల్లో కోటిమందికి పైగా వ్యక్తులు ఉన్నారు.

ఈ ఏడాది కొత్తగా 78 వేల కుటుంబాలు పథకంలో చేరాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 34.51 లక్షల యాక్టివ్ జాబ్ కార్డులు ఉండగా, యాక్టివ్ కూలీలు 58.58 లక్షల మంది ఉన్నారు. వీరిలో మహిళలే 62 శాతం ఉన్నట్లు గణాంకాలు వెల్లడి స్తున్నాయి.

కూలీల గణాంకాలపై దృష్టి..

రాష్ట్రప్రభుత్వం రైతుభరోసా పథకం వర్తింపునకు కూలీలను ఎంపిక చేయడం ప్రభుత్వానికి జటిలమైన సమస్య. కొన్నిప్రాంతాల్లో సాగు కలిసి రాక కొందరు రైతులు వ్యవసాయ కూలీలుగా మారారు. ఈ కోవ కు చెందిన రైతులు పెట్టుబడి సాయానికి అర్హులు కాలేరు.

మరోవైపు కూలీలు ఎవరు ? అని నిర్ధారించేందుకు ప్రభుత్వం ఉపాధి పథకాన్ని ఆధారం చేసుకోనున్నట్లు తెలిసిం ది. ఇప్పటికే రాష్ట్రవ్యా ప్తంగా జాబ్ కార్డులు న్న కుటుంబాలు, కూలీల వివరాలను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. దీనిపై అధ్యయనం పూర్తయిన తర్వాత ప్రభుత్వం పథకానికి కూలీలను ఎంపిక చేస్తుందని సమాచారం.

కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ గణాంకాల ప్రకారం..

రాష్ట్రవ్యాప్తంగా ఉపాధి హామీ పరిధిలోని కుటుంబాలు 53,05,513

ఆయా కుటుంబాల్లోని వ్యక్తుల సంఖ్య 1,04,53,434

పథకంలో ఈ ఏడాది కొత్తగా చేరిన కుటుంబాలు 78,942

కొత్తగా జాబ్ కార్డు పొందిన వారి సంఖ్య 2,17,839

ఈ ఏడాది ఏడాది గణాంకాలు

ఉపాధి పని చేసిన కుటుంబాలు 25,49,597

పని చేసిన కూలీ సంఖ్య 40,23,927

వారిలో మహిళలు 62.23 శాతం 

వంద రోజులు, అదనంగా పనిచేసిన కుటుంబాలు 30,386

50 రోజులకు పైగా పనిచేసిన కుటుంబాలు 8,48,806

జాబ్‌కార్డులున్న కుటుంబాల్లో పనిచేస్తున్న కుటుంబాలు 25,49,597

యాక్టివ్ జాబ్ కార్డుల సంఖ్య 34.51 లక్షలు

యాక్టివ్ కూలీల సంఖ్య 58.58 లక్షలు