జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్...
నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్యను పెంచాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ వైద్య అధికారులను ఆదేశించారు. నిర్మల్ జిల్లాలోని నిర్మల్ మాత శిశు సంక్షేమ ఆస్పత్రితో పాటు నరసాపూర్ ముధోల్ బైంసా ఖానాపూర్ తదితర ఆసుపత్రిలో అందుతున్న ఆరోగ్య సేవలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. సాధారణ ప్రసవాలను పెంచాలని విధులు నిర్వహించే సిబ్బంది సమయపాలన పాటించాలని రోగులకు అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించి ప్రభుత్వ వైద్యంపై నమ్మకం కలిగించేలా వ్యవహరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ రాజేందర్, వైద్య సిబ్బంది ఉన్నారు.