జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
పెద్దపల్లి, ఫిబ్రవరి-5: ప్రభుత్వ ఆసుపత్రిలో 100 శాతం ప్రసవాలు జరిగే విధంగా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష వైద్యాధికారులను ఆదేశించారు. బుధవారం సమీకృత కలెక్టర్ కార్యాలయంలో వైద్య అధికారులతో సమావేశం నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలకు ఫస్ట్ ,సెకండ్ ఎ న్ సి సబ్ సెంటర్ లోనే అందించాలని డెలివరీ కి సిద్ధంగా ఉన్న వారిని గుర్తించి ప్రభుత్వ ఆసుపత్రికి డెలివరీ కి వచ్చే విధంగా చర్యలు చేపట్టా లన్నారు.
నాన్ కమ్యూనికేబుల్ డిసీసెస్ ఉన్న వారిని ఫిబ్రవరి నెల ఆఖరి వరకు పూర్తిగా గుర్తించి వైద్యం అందించాలని, షుగర్ పేషెంట్లను మానేటరింగ్ చేసి వారికి కావాల్సిన వైద్యం, మందులు అందించాలని అన్నారు. టీబీ పరీక్షలకు సంబంధించి 100 రోజుల ప్రణాళికను తయారు చేసుకోవాలని,
తెమడ పరీక్ష నిర్వహించిన తరువాత రిపోర్ట్ తొందరగా అందే విధంగా చర్యలు చేపట్టాలని, నిర్మాణం పూర్తయిన పల్లె దావఖానాలను అందుబాటులోకి తీసుకువచ్చి ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలన్నారు.
ప్రోగ్రాం ఆఫీసర్లు ప్రతిరోజు సబ్ సెంటర్, పల్లె దావఖానాలను తనిఖీ చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ శ్రీధర్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అన్న ప్రసన్న కుమారి ,సంబంధిత అధికారులు, తదితరులు పాల్గోన్నారు.