calender_icon.png 3 February, 2025 | 11:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచాలి

02-02-2025 12:00:00 AM

కలెక్టర్ సందీప్ కుమార్ ఝా 

కోనరావుపేట, ఫిబ్రవరి 1: జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచే లా చర్యలు తీసుకోవాలని   వైద్యాధికారు లు, సిబ్బందిని కలెక్టర్ సందీప్ కుమార్ ఝాహొ ఆదేశించారు. కోనరావుపేట మం డల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా ఆసుపత్రి ఆవరణ, ఇన్ పేషెంట్ వార్డ్, ల్యాబ్, ఫార్మసీ పరిశీలించారు.

ఓపి, రక్త పరీక్షలపై ఆరా తీశారు. అనంతరం పీహెచ్సీ పరిధిలో వైద్య సేవలు పొందుతున్న గర్భిణులతో కలెక్టర్ నేరుగా ఫోన్లో మాట్లాడారు. ఇక్కడ అందు తున్న సేవలు, మందులువారి ఆరోగ్య వివ రాలు తెలుసుకున్నారు. ఫార్మసీ నీ పరిశీలిం చి నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. దాదాపు ముగ్గురు గర్భిణులకు ఫోన్ చేసి వివరాలు అడిగారు. అనంతరం వైద్యులు, ఆసుపత్రి సిబ్బందితో మాట్లా డారు.

మండ లంలోని గర్భిణు లకు ప్రభుత్వ దవఖానాల్లో అందిస్తున్న సేవలు, మందులపై అవగాహన కల్పించాలన్నారు. గర్భిణులు, బాలింతలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని నిరంతరం వారి ఆరోగ్య వివరాలను సేకరించా లని, వారికి కావాల్సిన మందు లు అన్ని అందుబాటులో ఉం చాలని వైద్యులకు సూచించా రు. పబ్లిక్ పరీక్షల్లో విద్యార్థులు 10 జీపీఏ అన్ని సబ్జెక్టుల్లో వచ్చే లా తీర్చిదిద్దాలన్నారు.

మండ ల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలిక ల విద్యాలయాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు తరగతి గదులు, స్టోర్ రూమ్ ఆహా రం వన్డే గదిని పరిశీలించారు. కూరగాయ లు, సరుకుల నాణ్యతను తనిఖీ చేశారు. అ నంతరం పదో తరగతి విద్యార్థులకు మ్యా థ్స్, సైన్సు పాఠ్యాంశాలు బోధించారు. 

వి ద్యార్థులకు వైద్య సిబ్బందితో పరీక్షలు చే యించాలని, వారికి కావాల్సిన మందులను అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలను సైతం తని ఖీ చేశారు. అనంతరం కలెక్టర్ మండల కేం ద్రంలోని ఎంపీడీవో, తహసిల్దార్ కార్యాల యాల్లో ఆకస్మికంగా తనిఖీ చేశారు.

అధికా రులు, సిబ్బంది హాజరుపై ఆరా తీశారు. తహసీల్ కార్యాలయంలో పలు రికార్డులను తనిఖీ చేశారు.  మండల వైద్యాధికారి వేణు మాధవ్, కేజీబీవీ ఎస్‌ఓ ఇందిరా, జూని యర్ కళాశాల ప్రిన్సిపాల్ కేదారీశ్వర్ తదితరులు పాల్గొన్నారు.