01-03-2025 11:29:04 PM
కోర్టులో పెండింగ్ కేసులు పెరిగిపోతున్నాయి..
హైకోర్టు న్యాయమూర్తి సామ్ కోషి..
హయత్‌నగర్ కోర్టులో బార్ అసోసియేషన్ ప్రారంభం..
ఎల్బీనగర్: రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కోర్టులను పెంచాలని, పెండింగ్‌లో ఉన్న కేసులను సత్వరమే పూర్తి చేసి, బాధితులకు న్యాయం చేయాలని హైకోర్టు న్యాయమూర్తి సామ్ కోషి సూచించారు. హయత్‌నగర్‌లోని కోర్టులో శనివారం బార్ అసోసియేషన్ కార్యాలయాన్ని హైకోర్టు న్యాయమూర్తులు సామ్ కోషి, విజయ్‌సేన్ రెడ్డి, నందికొండ నర్సింగ్‌రావు తదితరులు ప్రారంభించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తులు మాట్లాడుతూ... కోర్టులలో పెండింగ్ కేసులను సత్వరమే విచారణ పూర్తి చేయాలన్నారు. హయత్‌నగర్‌లో కోర్టులో సుమారు 8వేల కేసులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. చిన్న పరిధిలో ఉన్న కోర్టులోనే ఇన్ని కేసులు పెండింగ్‌లో ఉంటే బాధితులకు ఏలా న్యాయం జరుగుతుందని ప్రశ్నించారు.
ప్రతి ప్రాంతంలో నూతనంగా కోర్టులను ఏర్పాటు చేసి, బాధితులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. హయత్‌నగర్ కోర్టులో ఖాళీగా ఉన్న జూనియర్ సివిల్ న్యాయమూర్తులు, ప్రభుత్వ న్యాయవాదుల పోస్టులను ఖాళీ చేయాలని సూచించారు. కాగా, అనంతరం కోర్టు అవరణను న్యాయమూర్తులు పరిశీలించారు. కోర్టులో సమస్యలు ఉంటే తమ దృష్టికి తేవాలని కోరారు. కార్యాక్రమంలో హయత్‌నగర్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి శశీధర్‌రెడ్డి, అదనపు న్యాయమూర్తి జయప్రసాద్, న్యాయమూర్తులు సాల్మా ఫాతిమా, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు భిక్షపతిగౌడ్, ప్రధాన కార్యదర్శి సంతోష్ కుమార్ గౌడ్, ఉపాధ్యక్షులు రవి, నరేశ్, సతీశ్, ఈశ్వర్, శివకుమార్, సరిత, యాదయ్య, మహేందర్‌రెడ్డి, రాజేశ్, జయసుధదేవి, నాగిరెడ్డి, మాధురి తదితరులు పాల్గొన్నారు.