- హైకోర్టు జడ్జి జస్టిస్ విజయ్‌సేన్‌రెడ్డి
- సిద్దిపేట జిల్లా చేర్యాలలో జూనియర్ సివిల్ కోర్టు ప్రారంభం
సిద్దిపేట, జనవరి 11 (విజయక్రాంతి): పిల్లల భవిష్యత్ కోసం తల్లిదండ్రులు ఆస్తులు ఇచ్చేదానికన్నా చదువు, సంస్కారం నేర్పించాలని హైకోర్టు జడ్జి జస్టిస్ విజయ్‌సేన్‌రెడ్డి సూచించారు. సిద్దిపేట జిల్లా చేర్యాల మండల కేంద్రంలో శనివారం జూనియర్ సివిల్ కోర్టును ప్రారంభించి మాట్లాడారు. పెరుగుతున్న జనాభాకు సరిపడా కోర్టులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. న్యాయవాదులు సొంత లా కోసం కాకుండా సమాజం కోసం పనిచేయలన్నారు.
కోర్టుల్లో సీనియర్ లాయర్ల సంఖ్యనే అధికంగా కనిపిస్తోందని.. జూనియర్ లాయర్లను కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. చేర్యాలలో కోర్టు ఏర్పాటు చేయడంతో చేర్యాల, కొమురవెళ్లి, మద్దూర్, దూల్‌మిట్ట తదితర ప్రాంత ప్రజలకు స్థానికంగానే కోర్టు సేవలు అందుబాటులో వచ్చాయన్నారు. అనంతరం సిద్ధిపేట జిల్లా ప్రిన్సిపల్, సెషన్స్ జడ్జి జస్టిస్ సాయిరమాదేవి మాట్లాడుతూ.. చేర్యాలలో కోర్టు ఏర్పాటుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యావాదాలు తెలిపారు.
ఈ ప్రాంతం ప్రజలకు సత్వర న్యాయం జరిగేలా లాయర్లు కృషి చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో సిద్ధిపేట జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ అబ్దుల్ హమీద్, మెదక్ జిల్లా జడ్జి లక్ష్మిశారాధ, వివిధ కోర్టుల జడ్జిలు, జనగామ ఎమ్మె పల్లా రాజేశ్వర్ రెడ్డి, సిద్దిపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జనార్దన్‌రెడ్డి, గజ్వేల్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పాండు, సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్, జనగామ, హుస్నాబాద్, చేర్యాల ప్రాంతాలకు చెందిన న్యాయవాదులు పాల్గొన్నారు.
విజయక్రాంతి క్యాలెండర్ ఆవిష్కరణ
కోర్టు ప్రారంభోత్సవం సందర్భంగా ఏ చేసిన సమావేశంలో హైకోర్టు జడ్జి జస్టిస్ విజయ్‌సేన్‌రెడ్డి, జిల్లా ప్రిన్సిపల్, సెషన్స్ జడ్జి సాయిరమాదేవి, జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ అబ్దుల్ హమీద్ తదితరులు విజయక్రాంతి (తెలుగు), మెట్రో ఇండియా (ఇంగ్లిష్) దినపత్రికల క్యాలెండర్లను ఆవిష్కరించారు. కార్యక్రమం విజయక్రాంతి దినపత్రిక జర్నలిస్టులు పాల్గొన్నారు.