అప్రమత్తత లేకపోతే ఆగం కాక తప్పదు
ఏఎస్ఐ విజయలక్ష్మి...
నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): స్మార్ట్ ఫోన్ వినియోగం పెరిగిన నేపథ్యంలో ఇంస్టాగ్రామ్ ఫేస్బుక్ వంటి వేదికల్లోనే ఆకతాయిల సంఖ్య ఎక్కువగా ఉంటుందని యువత అనవసరమైన చాటింగ్ లో చేసి మోసపోవద్దని షీ టీం ఇన్చార్జ్ ఏఎస్ఐ విజయలక్ష్మి పేర్కొన్నారు. శుక్రవారం నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి మండలం మంగనూరు అంబేద్కర్ విజ్ఞాన వేదిక సహకారంతో విద్యార్థులకు ఏర్పాటు చేసిన షీ టీం అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. విద్యార్థులు ఇంస్టా, ఫేస్ బుక్ అంటూ ఎక్కువగా మొబైల్ ఫోన్ లలో చాటింగ్ చేస్తూ కొత్త పరిచాయలతో మోసపోతున్నారని వారి తల్లిదండ్రులు కూడా విద్యార్థుల కదలికలపై నిఘా ఉంచాలన్నారు. ఆన్లైన్ మోసాలకు దూరంగా ఉండాలి. అపరిచిత వ్యక్తుల పట్ల ఆకతాయిల ఆగడాలు ఎక్కువగా ఉన్నాయి, కాబట్టి ప్రయాణంలో ఉన్న అమ్మాయిలు, మహిళలు టీ సేఫ్ అప్ ని డౌన్లోడ్ చేసుకొని ప్రయాణంలో ఉన్నపుడు తప్పక యాపును ఉపయోగించుకోవాలని వివరించారు.
మహిళలు బాలికలు ఆకతాయిల వేధింపులకు గురైనప్పుడు వారి వివరాలను తప్పకుండ షీటీం ని సంప్రదించి ఫిర్యాదు చేస్తే వారి వివరాలు గోప్యంగ ఉంచి ఆకతాయిల ఆట కట్టించి సమస్యను పరిష్కరిస్తామన్నారు. విద్యార్థులపై అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే పోలీస్ సంస్థ చూస్తూ ఊరుకోదని అటువంటి వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. ప్రత్యేకంగా ప్రధాన కూడలిలో చౌరస్తాలలో మండల జిల్లా కేంద్రాలలో షీ టీం పనిచేస్తుందని బాధితులు డయల్ 100, 8712657676 నెంబర్ కు ఫోన్ చేసి వివరాలు తెలపాలని కోరారు. ఈ కార్యక్రమంలో షి టీం బృందం వెంకటయ్య, భరోసా టీం రాధిక, అంబేద్కర్ విజ్ఞాన వేదిక సభ్యులు, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.