calender_icon.png 15 January, 2025 | 11:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నోట్లకట్ట విషయం బాధించింది..

14-01-2025 12:09:50 AM

* ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్

న్యూఢిల్లీ, జనవరి 13: ‘పార్లమెంట్ సమావేశాల సందర్భంగా రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యుడు అభిషేక్ మను సింఘ్వికి కేటాయించిన సీటు వద్ద నోట్లకట్ట కనిపించింది. సభ్యులెవరైనా తమ అవసరాల దృష్ట్యా డబ్బు తీసుకువచ్చి ఉండొచ్చు. ఆ విషయంలో తప్పు పట్టేదేం లేదు. ఆ డబ్బు తమదని ఎవరూ ముందుకు రాకపోవడం నన్ను బాధించింది.

నైతిక విలువలకు ఇది ఒక సవాలు లాంటింది’ అంటూ ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ ఉద్వేగానికి గురయ్యారు. న్యూ ఢిల్లీలో సోమవారం జరిగిన ఓ పుస్తకావిష్కరణ సభలో ఆయన మాట్లాడారు. 1990 వరకు రాజ్యసభలో నైతిక విలువల కమిటీ లేదని, ఆ తర్వాతే నైతిక విలువల కమిటీ ఏర్పాటైందని గుర్తుచేశారు.