* కమ్మేసిన పొగమంచు
* వందలాది విమానాలు ఆలస్యం.. మరిన్ని రద్దు
* అవస్థలు పడుతున్న ప్రజలు
* పొగమంచుతో రోజువారీ పనులకు ఆటంకం
* హర్యానాలో రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
* రైలు సర్వీసులకు కూడా అంతరాయం
న్యూఢిల్లీ, జనవరి 4: ఉత్తర భారతాన్ని దట్టమైన పొగమంచు కమ్మేసింది. తీవ్రమైన చలిగాలులకు తోడు పొగమంచుతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. అనేక విమాన, రైల్వే సర్వీసులు ఆలస్యమవడమే కాకుండా రోజువారీ కార్యకలాపాలకు కూ డా అంతరాయం కలుగుతోంది. రాజధాని ఢిల్లీతో పాటు ఉత్తరాది రాష్ట్రాల్లో పొగమంచు ప్రభావం అధికంగా కనిపిస్తోంది.
ఢిల్లీలోని పాలెం ఎయిర్‌పోర్టులో విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. కొన్ని సర్వీసులను రద్దు చేస్తూ ప్రొవైడర్లు నిర్ణయం తీసుకున్నాయి. పొగమంచు ప్రభావంతో ఏదీ సరిగ్గా కనిపించకపోవడంతో విమానాలను రద్దు చేసినట్లు విమానయాన సంస్థలు ప్రకటించాయి.
ఢిల్లీ నుంచి బయల్దేరే 520 విమాన సర్వీసులు ఆలస్యం కాగా, దాదాపు 60 సర్వీసులను రద్దు చేశారు. మరో 15 విమానాలను దారి మళ్లించారు. పొగమం చు ప్రభావం విమాన సర్వీసులపై పడిందని, సర్వీసులకు సంబంధించిన తదుపరి సమాచారం కోసం ఎయిర్‌లైన్ అధికారులను సం ప్రదించాలని ఎయిర్‌పోర్ట్ అధికారులు వెల్లడించారు.
కోల్‌కతాలో అదే కథ..
పశ్చిమ బెంగాల్‌ను కూడా పొగమంచు ఇబ్బంది పెడుతోంది. కోల్‌కతా విమానాశ్రయంలోనూ దాదాపు 80 విమాన సర్వీసులను ఆలస్యంగా నడిపారు. మరో 5 విమాన సర్వీసులను రద్దు చేశారు. ఈ రెండు రాష్ట్రాలు అనే కాకుండా ఉత్తరాదిలోని చత్తీస్‌గఢ్, ఆగ్రా, అమృత్‌సర్ తదితర నగరాల్లో ఇవే పరిస్థితులు నెలకొన్నాయి.
పొగమంచు వల్ల విమానాలు, రైలు సర్వీసులు ఆలస్యంగా నడవడమే కాకుండా ప్రజల రోజువారీ పనులపై కూడా తీవ్ర ప్రభావం పడుతోంది. ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్, లక్నో, ఆగ్రా, ఘజియాబాద్, జైపూర్, అమృత్‌సర్ తదితర చోట్ల వాహనాలు రోడ్లపై నెమ్మదిగా కదిలాయి. నెమ్మదిగా ప్రయాణాలు చేస్తున్నా కానీ సరైన విజిబులిటీ లేకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
400 విమానాలు ఆలస్యం
ఈ పొగమంచు ప్రభావం వల్ల పలు రాష్ట్రాల్లో విమాన సర్వీసులు ప్రభావితం అయ్యాయి. కేవలం ఢిల్లీ విమానాశ్రయంలోనే 400 విమానాలు ఆలస్యం అయ్యా యి. కేవలం విమానాలు మాత్రమే కాకుం డా రైళ్లు కూడా ఆలస్యం అయ్యాయి. దీంతో దూర ప్రాంతాలకు వెళ్లే వారు అవస్థలు పడ్డారు. మరోపక్క ఢిల్లీలో గాలి నాణ్యత కూడా పడిపోయింది. శుక్రవారం సాయం త్రం ‘వెరీ పూర్’ కేటగిరీలో గాలి నాణ్యత రికార్డుంది. కొన్ని ప్రాంతాల్లో సివియర్ రేంజ్‌లో కనిపించింది.
హర్యానాలో ప్రమాదం.. నలుగురు మృతి
దట్టమైన పొగమంచు కారణంగా హర్యానాలోని హిసార్ ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృ తిచెందారు. పొగమంచు వల్ల రోడ్డు మీ ద ఏమీ కనిపించకపోవడంతోనే ఈ ప్ర మాదం జరిగినట్లు తెలుస్తోంది. ఉద యం పూట ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పంజాబ్‌లోని భటిండా హైవే మీద కూడా ప్రమాదం జరిగింది. కాగా ఈ ఘటనలో 15 మంది వరకు గా యాలపాలయ్యారు. ఇవి మాత్రమే కాకుండా పొగమంచు, సరై న విజిబులిటీ లేకపోవడం వల్ల అనేక ప్రమా దాలు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.
రెండో రోజు.. అదే బేజారు
దేశ రాజధాని ఢిల్లీలో వరుసగా రెండో రోజు కూడా పొగమంచు ప్రభా వం కనిపించింది. ఈ పొగమంచు వల్ల వందల సంఖ్యలో రైళ్లు, పదుల సంఖ్యలో విమానాలు ఆలస్యం అయ్యాయి. మరిన్నిటిని దారి మళ్లించారు. ఢిల్లీలోని పాలెం అంతర్జాతీయ విమానాశ్రయం లో జీరో విజిబులిటీతో విమాన సర్వీసులకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. వరుసగా రెండో రోజు కూడా లోవిజిబులిటీతో అక్కడి ప్రజలు అవస్థలు పడ్డారు.
భారత వాతావరణ శాఖ (ఐఎండీ) శనివారం ఢిల్లీకి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. పంజాబ్, హర్యానా, యూపీ, రాజస్థాన్, బీహార్, పశ్చిమ్‌బెంగాల్, మధ్యప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లోనూ దట్టమైన పొగమంచు అలుముకుంది. ఢిల్లీలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. శనివారం ఉదయం 5.30 గంటలకు 10.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.
శుక్రవారం రోజు 9.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవడంతో ప్రజలు గజగజలాడుతున్నారు. కేవలం ఢిల్లీలో మాత్రమే కాకుండా ఉత్తరభారతదేశం మొత్తం ఇవే పరిస్థితులు దర్శనం ఇస్తున్నాయి. రానున్న మరికొన్ని రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
శనివారం వివిధ విమానాశ్రయాల్లో విజిబులిటీ స్థాయిలు
పాలెం (న్యూఢిల్లీ) ;0
సప్దర్‌జంగ్ (న్యూఢిల్లీ) ;0
శ్రీనగర్ ;100
అమృత్‌సర్ ;0
పఠాన్‌కోట్ ;1500
కాన్పూర్ ;200
పట్నా ;100
గ్వాలియర్ (మధ్యప్రదేశ్) ;0
లక్నో ;350