calender_icon.png 22 December, 2024 | 7:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నైజీరియన్ మహిళ హంగామా..

11-10-2024 01:47:54 PM

బండ్లగూడ పి ఎన్ టి కాలనీలో నైజీరియన్ల వీసా, పాస్ పోర్టు తనిఖీలు చేసిన పోలీసులు  

వీసా ముగిసినా ఉంటున్న మహిళ, పిఎస్ కు తరలిస్తుండగా హంగామా..

రాజేంద్రనగర్, (విజయక్రాంతి) : వీసా, పాస్ పోర్టు గడువు ముగిసినా ఇండియాలో ఉంటున్నారనే అనుమానంతో నైజీరియన్లను పోలీసులు తనిఖీలు చేశారు. ఈ క్రమంలో వీసా గడువు ముగిసిన ఉంటున్న ఓ నైజీరియన్ మహిళ హల్ చల్ చేసింది. ఆమెను అదుపులోకి తీసుకున్న రాజేంద్రనగర్ పోలీసులు పీఎస్ కు తరలించారు. వివరాలు.. బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పిఎన్టి కాలనీలో రాజేంద్రనగర్ పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేశారు. నైజీరియన్స్ ఉండే ప్రాంతంలో దాడులు నిర్వహించి వీసా, పాస్ పోర్టు తదితర పత్రాలను పరిశీలించారు. వీసా ముగిసినప్పటికీ ఇండియాలో ఉంటున్న ఓ నైజీరియన్ లేడిని పోలీసులు గుర్తించారు. దీంతో ఆమెను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలిస్తుండగా నానా హంగామా సృష్టించింది. ఈ మేరకు ఆమెను విచారణ జరుపుతున్నారు.