08-04-2025 01:23:21 AM
కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు
రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కే లక్ష్మణ్
ముషీరాబాద్, ఏప్రిల్ 7 (విజయక్రాంతి) : కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉందని ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని ఎంపీ డాక్టర్ కే. లక్ష్మణ్ ఆరోపించారు. అప్పుల కోసం చిప్ప పట్టుకొని ఢిల్లీకి వెళ్లి అడుగుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి పై ధ్వజమెత్తారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం ముషీరాబాద్ డివిజన్ లోని జాంభవి నగర్‌లో బీజేపీ డివిజన్ అధ్యక్షుడు కంచి ముదిరాజ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బీజేపీ జెండాను డాక్టర్ కే. లక్ష్మణ్ ముఖ్య అతిథిగా హాజరై కార్పొరేటర్ సుప్రి యా నవీన్‌గౌడ్‌తో కలిసి ఆవిష్కరించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రం లో అమలుకు నోచుకోని హామీలను ప్రజలకు ఇచ్చి వాటిని నెరవేర్చకుండా అప్పుల కోసం కేంద్రాన్ని చేయిచాచడం ఎంతవరకు సమంజసమన్నారు. హెచ్ సి యు భూములను అమ్మాలని సీఎం రేవంత్ రెడ్డి యత్ని స్తే కోర్టులు ప్రభుత్వానికి మెట్టికాయలు వేశాయని పేర్కొన్నారు.16 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
పేదల సంక్షేమానికి కృషి చేస్తున్న ప్రధాని నరేంద్రమోదీ వక్ఫ్ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడితే ఎంఐఎం, బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ముస్లీంలను తప్పుదోవ పట్టిస్తూ వారిని రెచ్చగొట్టి వక్ఫ్ బిల్లును అడ్డుకునేందుకు యత్నించారని ఆరోపించారు. వారి అవినీతిని అరికట్టేందుకే వక్ఫ్ బిల్లును పార్లమెం టులో ప్రవేశపెట్టి పేద ముస్లీం లకు న్యాయం చేసేందుకు ప్రధాని నరేంద్రమోదీ చర్యలు తీసుకున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ముషీరాబాద్ కార్పొరేటర్ సుప్రి యా నవీన్ గౌడ్, బీజేపీ మహాంకాళి జిల్లా అధ్యక్షుడు భరత్ గౌడ్, ముషీరాబాద్ నియోజకవర్గం కన్వీనర్ రమేష్ రామ్ , జాయింట్ కన్వీనర్ ఎం. నవీన్ గౌడ్, బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పూసరాజు, బీజేవైఎం నాయకులు అనిల్ కుమార్, కుషాల్ గౌడ్, ఆయూష్, బీజేపీ సీనియర్ నాయకులు బొల్లంపల్లి రాంరెడ్డి, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
కేంద్ర ప్రభుత్వం కల్పిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి చైతన్యం చేయాలని రాజ్యసభ సభ్యుడు, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కే. లక్ష్మణ్ కార్యకర్తలు, నాయకులను కోరారు. భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో భాగంగా సోమవారం గాంధీనగర్ డివిజన్ కెనరా బ్యాంక్ సర్కిల్ వద్ద బూత్ నెంబర్ 36 లో రాజ్యసభ సభ్యుడు, ఓబీసీ మోర్చ జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె.లక్ష్మణ్ గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ. పావని వినయ్ కుమార్ తో కలిసి బీజేపీ పార్టీ జెండాను ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో బిజెపి సికింద్రాబాద్ మహంకాళి జిల్లా అద్యక్షులు భరత్ గౌడ్, ఓబీసీ జాతీయ కార్యవర్గ సభ్యులు పూస రాజు, బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ. వినయ్ కుమార్, అసెంబ్లీ కన్వీనర్ రమేష్ రామ్, డివిజన్ అధ్యక్షులు వీ.నవీన్ కుమార్, బూత్ అధ్యక్షులు బాలస్వామి, బీజేపీ సీనియర్ నేతలు రత్న సాయి చంద్, శ్రీకాంత్, వీఎస్‌టి రాజు, పి.నర్సింగ్ రావు, ఎం. ఉమే ష్, ఆకుల సురేందర్, మహమూద్, లక్ష్మణ్ యాదవ్, నర్సింహ, దొనేటి సత్యం, ఆనంద్ రావు, లక్ష్మి నారాయణ, అరుణ్ కుమార్, నీరజ్, ప్రశాంత్, రాజ్ కుమార్, సంధ్యా రాణి, పూర్ణ తదితరులు పాల్గొన్నారు.