calender_icon.png 10 January, 2025 | 1:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తర్వాతి చిత్రం.. తండ్రి డ్రీమ్ ప్రాజెక్టే!

05-01-2025 12:10:19 AM

దర్శకుడు శంకర్ ఈ సంక్రాతికి ‘గేమ్ చేంజర్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. కమల్‌హాసన్ కథానా యకుడిగా ఆయన గత ఏడాది తెరకెక్కించిన ‘భారతీయుడు 2’ మిశ్రమ ఫలితాలను సాధించింది. దీంతో ఆయన ఆశలన్నీ తాజాగా టాలీవుడ్ స్టార్ హీరో రామ్‌చరణ్‌తో కలిసి చేస్తున్న ‘గేమ్ చేంజర్’పైనే ఉన్నాయి.

ఈ సినిమా హిట్టయితే శంకర్.. తన తండ్రి డ్రీమ్ ప్రాజెక్టును ప్రారంభించే అవకాశం ఉందన్న టాక్ తమిళ నాట జోరుగా ప్రచారం జరుగుతోంది. ‘వీరయుగ నాయగన్ వేల్పరి’ అనే పుస్తకం ఆధారంగా ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తారని కోలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆ చిత్రాన్ని మొత్తం మూడు భాగాల్లో రూపొందించాలని శంకర్ భావిస్తున్నారట.

రూ.వెయ్యి కోట్ల బడ్జెట్‌తో భారీ ఎత్తున రూపొందించాలనుకుంటున్నట్టు సమాచారం. అయితే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కేదీ.. లేనిదీ ‘గేమ్ చేంజర్’ రిజల్ట్‌పైనే ఆధారపడి ఉందట.