calender_icon.png 27 December, 2024 | 12:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభిమానులు ఊహించని వార్త

14-10-2024 12:11:49 AM

పవన్ కల్యాణ్ చిత్రం ‘హరి హర వీర మల్లు’ కోసం ఆయన అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. తొలిసారిగా పవన్ పిరియాడికల్ చిత్రంలో నటిస్తున్నారు. యువ దర్శకుడు జ్యోతి కృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై దయాకర్ రావు హరి హర వీర మల్లును నిర్మిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

భారీ బడ్జెట్ చిత్రంగా ఇది రూపొందుతోంది. దసరా సందర్భంగా చిత్ర నిర్మాతలు పవన్ అభిమానులకు ఊహించని ఒక శుభవార్త చెప్పారు. అదేంటంటే ఈ చిత్రంలో పవన్ ఒక పాటను స్వయంగా పాడారు. దసరా సందర్భంగా చిత్రానికి సంబంధించిన పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. అక్టోబర్ 14 నుంచి చిత్రీకరణ తిరిగి ప్రారంభమై.. నవంబర్ 10 నాటికి ముగియనుందని నిర్మాతలు తెలిపారు.

సామ్రాజ్యవాదులు, అణచివేతదారులకు వ్యతిరేకంగా స్వాతంత్య్రం కోసం ఒక యోధుని అలుపెరుగని పోరాటం నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోందని వెల్లడించారు. ఈ సినిమాలో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. అనుపమ్ ఖేర్, సచిన్ ఖేడ్ ఖర్, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, మురళీ శర్మ, అనసూయ భరద్వాజ్ తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రం 28 మార్చి, 2025న విడుదల కానుంది.