calender_icon.png 20 September, 2024 | 2:48 AM

నూతన విద్యావిధానం చరిత్రాత్మకం

19-09-2024 01:29:43 AM

అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్‌రెడ్డి

కరీంనగర్, సెప్టెంబరు 18 (విజయక్రాంతి): విద్యారంగంలో అనేక మార్పులు వస్తున్నాయని, నూతన విద్యావిధానం చారిత్రాత్మకమని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధి నేత డాక్టర్ వి నరేందర్‌రెడ్డి అన్నారు. నూత న విద్యావిధానంలో నూతన మార్గదర్శకాల ను రూపొందించడమే కాకుండా అందరికి విద్య అందేలా ప్రణాళికలు రూపొందించాలన్నారు. బుధవారం కరీంనగర్‌లో తెలంగా ణ ప్రైవేట్ జూనియర్ డిగ్రీ, పీజీ కళాశాలల అసోసియేషన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నూ తన విద్యావిధానంపై సెమినార్ నిర్వహించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేడు విద్యారంగంలో చారిత్రాత్మక మార్పు లు చోటు చేసుకుంటున్నాయన్నారు.

ఉపాధ్యాయులు అందుకు అనుగుణంగా విద్యా బోధన చేసి, విద్యార్థులను భావిపౌరులుగా తీర్చిదిద్దాలన్నారు. పట్టభద్రుల ఎన్నికల్లో పో టీ చేస్తున్న తనకు పట్టభద్రులందరు మద్దతు ఇవ్వాలని కోరారు. అధ్యాపకులకు ఎదురవుతున్న పలు సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. మూడు సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉద్యోగుల డీఏల చెల్లింపు కోసం ముఖ్యమంత్రితో సమావేశమై, ఎమ్మెల్సీ ఎన్నికలలోపే సాధించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.

కాంగ్రెస్ టికెట్ తనకే వస్తుందన్న నమ్మకం ఉన్నదన్నారు. అనంతరం కళాశాలల యజమానులు, అధ్యాపకులు నరేందర్‌రెడ్డిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో టీపీజేఎన్‌ఏ జిల్లా ప్రతినిధులు ప్రభాకర్‌గౌడ్, వెంకట్, అధ్యాపకుల సంఘం ప్రతినిధులు మాసం రత్నాకర్‌రెడ్డి, రాజేశ్వర్, టీపీడీఎం ప్రతినిధులు రవీందర్‌రెడ్డి, సతీష్‌కుమార్ పాల్గొన్నారు.