calender_icon.png 27 October, 2024 | 2:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘మజాకా’ కొత్త షెడ్యూల్ షురూ

23-10-2024 12:00:00 AM

హీరో సందీప్ కిషన్ 30వ సినిమా ‘మజాకా’. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్య మూవీస్, జీ స్టూడియోస్ బ్యానర్లపై రాజేశ్ దండా నిర్మిస్తున్నారు. ఇందులో రావు రమేశ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీ కొత్త షూటింగ్ షెడ్యూల్ తాజాగా వైజాగ్‌లో ప్రారంభమైంది.

20 రోజుల లెన్తీ షెడ్యూల్‌లో, సందీప్ కిషన్, ఇతర ముఖ్య తారాగణంపై కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిం చనున్నారు. మరోవైపు ప్రొడక్షన్ వర్క్స్ సైతం శరవేగంగా జరుగుతున్నాయి. వచ్చే సంక్రాంతికి విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రానికి సంగీతం: లియోన్ జేమ్స్; డీవోపీ: నిజార్ షఫీ; కథ, స్క్రీన్ ప్లే, మాటలు: ప్రసన్న కుమార్ బెజవాడ.