calender_icon.png 16 January, 2025 | 10:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నూతన పాలకవర్గం అదే చేయాలి

06-07-2024 12:08:08 AM

రైతులకు సమస్యలు రానీయకుండా చూడాలి

మంత్రి తుమ్మల

హైదరాబాద్, జూలై 5 (విజయక్రాంతి):  రాష్ట్ర ప్రభుత్వం వనపర్తి టౌన్, వికారాబాద్ జిల్లాలోని తాండూరు, బషీరాబాద్, జగిత్యాల జిల్లా ధర్మపురి వ్యవసాయ మార్కెట్ కమిటీలకు నూతన పాలకవర్గ సభ్యులను ని యమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.  మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో మొత్తం 197 మార్కెట్ కమిటీలుండగా.. ఇప్పటికే 11 మార్కెట్ కమిటీలకు చైర్మన్‌లతో పాటు కొత్తగా పాలకవర్గ  సభ్యులను నియమించినట్లు తెలిపారు. త్వరలో మిగిలిన మార్కెట్ కమిటీకు చైర్మన్లతో పాటు పాలక వర్గాలను కూడా ఏర్పాటు చేస్తామన్నారు. మార్కెట్ యార్డులలో రైతులు తమ పంటను అమ్ముకోవడానికి అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని, మార్కెట్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత సభ్యులదేనని గుర్తు చేశారు.