calender_icon.png 1 October, 2024 | 10:25 AM

నూతన లేబర్ కోడ్లను వెనక్కి తీసుకోవాలి

01-10-2024 02:13:27 AM

ఐఎఫ్‌టీయూ జాతీయ ఉపాధ్యక్షుడు ప్రదీప్

ముషీరాబాద్, సెస్టెంబర్ 30:  రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్, అసంఘటిత రంగ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని పలువరు వక్తలు డిమాండ్ చేశారు. సోమవారం ఇందిరాపార్కు ధర్నాచౌక్‌లో భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఐఎఫ్‌టీయూ) ఆధ్వర్యంలో మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఐఎఫ్‌టీయూ జాతీయ ఉపాధ్య క్షుడు బూర్గుల ప్రదీప్, ప్రధాన కార్యదర్శి సాదినేని వెంకటేశ్వర రావు, శ్రీనివాసులు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన నూతన నేర చట్టాలను, నాలుగు లేబర్ కోడ్లను తక్షణమే వెనక్కి తీసుకోవాల ని వారు డిమాండ్ చేశారు.