ఆస్ట్రేలియాపై వన్డే సిరీస్ గెలిచిన పాక్
పెర్త్: ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో పాక్ జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా మూడు వన్డేల సిరీస్‌లో 2 తేడాతో విజయం సాధించింది. హరిస్ రౌఫ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులను సొంతం చేసుకున్నాడు. తొలి వన్డేలో ఆసీస్ గెలవగా.. రెండో వన్డేలో గెలిచి సిరీస్‌ను సమంచేసింది. ఇక నిర్ణయాత్మక మూడో వన్డేలో కూడా పాకిస్తాన్ 8 వికెట్ల తేడాతో గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకుంది.
స్వదేశంలో వరుసగా సిరీస్‌లు ఓడిపోతున్న పాక్‌కు ఈ సిరీస్ విజయం ఊరటే అని చెప్పాలి. ఈ సిరీస్‌లో పాక్ జట్టుకు కీపర్ రిజ్వాన్ కెప్టెన్సీ చేశాడు. మూడో వన్డేలో టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా కేవలం 31.5 ఓవర్లలోనే చాపచుట్టేసింది. కేవలం 141 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని పాక్ ఆడుతూ పాడుతూ చేధించింది. షాహిన్ అఫ్రిది, నసీమ్ షా చెరి మూడు వికెట్లతో ఆసీస్ పతనంలో కీలకపాత్ర పోషించారు. 14 నుంచి మూడు టీ20ల సిరీస్ ఆరంభం కానుంది.