calender_icon.png 15 January, 2025 | 5:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొత్త గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ

28-07-2024 04:09:42 AM

  1. పలు రాష్ట్రాలకు గవర్నర్లను నియామకం 
  2. తెలంగాణకు త్రిపుర బీజేపీ నేత

న్యూఢిల్లీ, జూలై 27: తెలంగాణ రాష్ట్ర నూతన గవర్నర్‌గా త్రిపురకు చెందిన బీజేపీ నేత జిష్ణుదేవ్ వర్మ నియమితులయ్యారు. తెలంగాణతోపాటు పలు రాష్ట్రాలకు రాష్ట్రపతి కొత్త గవర్నర్లను నియమిస్తూ శనివారం ఆదేశాలు జారీచేశారు. తెలంగాణ ఇన్‌చార్జి గవర్నర్‌గా ఉన్న సీపీ రాధాకృష్ణన్‌ను మహారాష్ట్ర గవర్నర్‌గా నియమించారు. 

గవర్నర్‌గా మోదీ పరివార్ నేత

తెలంగాణ గవర్నర్‌గా నియమితులైన జిష్ణుదేవ్ వర్మ త్రిపురలో బీజేపీ కీలక నేతగా కొనసాగారు. మోదీ పరివార్‌లో ఆయన క్రియాశీలక నాయకుడు. 2018 నుంచి 2023 వరకు ఆ రాష్ట్రానికి రెండో డిఫ్యూటీ సీఎంగా పనిచేశారు. 1957 ఆగస్టు 15న త్రిపుర రాజకుటుంబంలో జిష్ణుదేవ్ వర్మ జన్మించారు. 1999 దశకంలో రామజన్మభూమి ఉద్యమంతో రాజకీయాల్లోకి వచ్చారు. త్రిపురలోని చరిలాం అసెంబ్లీ స్థానం నుంచి 2018లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన సుధా దేవ్ వర్మను వివాహం చేసుకొన్నారు. వీరికి ప్రతీక్ కిషోర్‌దేవ్ వర్మ, జైబంత్ దేవ్ వర్మ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. జిష్ణుదేవ్ వర్మ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు కూడా.