17-04-2025 02:03:41 AM
రాత్రి, పగలు యథేచ్ఛగా రవాణా
బహిరంగంగానే డంప్‌ల ఏర్పాటు
చూసీ చూడనట్లు రెవెన్యూ, పోలీసుల తీరు
సూర్యాపేట, ఏప్రిల్16 (విజయక్రాంతి): అక్రమ ఇసుక రవాణా ఏమాత్రం ఆగడం లేదు. జిల్లాలో ఇసుక మాఫియా ఎలాంటి అనుమతులు లేకుండా వాగులు, వంకల్లో కనబడ్డ ఇసుకను వదలకుండా తోడేస్తున్నారు. ఇసుక ధరలను కూడా అమాంతం పెంచి సామాన్యుడికి అందుబాటులో లేకుం డా చేస్తున్నారు. ప్రభుత్వం మన ఇసుక వాహనం పథకాన్ని జాజిరెడ్డిగూడెం మండ లం నుంచి చుట్టూ మండలాలకు ఇసుక రవాణా చేస్తున్నా... ఇతర మండలాలో జోరుగానే ఇసుకదందా కొనసాగుతున్నది.
సూర్యాపేట కేంద్రంగా...
జిల్లాలో అక్రమ ఇసుక రవాణా గత కొన్నేళ్ళుగా జోరుగా కొనసాగుతుంది. మూసీ, క్రిష్ణా పరివాక ప్రాంతంతో పాటు బిక్కేరు, పాలేరు తదితర ప్రాంతాల నుండి ఇసుకను తోడేస్తూ అక్రమ రవాణా చేస్తున్నారు. ఇలా అక్రమంగా తరలిస్తున్న ఇసుక ను మాఫీయా అధిక ధరలకు అమ్మి సొమ్ము చేసుకుంటుంది. జిల్లా కేంద్రంలో రోజు వందల సంఖ్యల్లో ఇసుక ట్రాక్టర్లు దర్శణమిస్తున్నాయి.
మూసీ పరివాక ప్రాంతమై న రాయినిగూడెం, టేకుమట్ల, కాసరబాద, కేటీ అన్నారం, పెన్పహాడ్ మండల పరిధిలోని అనాజీపురం గ్రామాల నుండి అక్ర మంగా ఇసుకను తవ్వీ జిల్లా కేంద్రంలో బహిరంగానే విక్రయిస్తున్నారు. ప్రతి రోజు ఉదయం జిల్లా కేంద్రంలోని నల్లాలభావి సెంటర్లో పదుల సంఖ్యలో ట్రాక్టర్లు ఇసుక లోడులో ఉంటున్నా అధికారులకు పట్టడం లేదు, అక్రమార్కులకు పోలీసులు, రెవెన్యూ అధికారులు సహకరిస్తున్నారని అనుమానం వెలువడుతున్నది.
అన్ని మండలాలలో ఇదే తంతూ..
ఇసుక అక్రమ రవాణా కండ్ల ఎదుటే సాగుతున్న అడ్డుకోవాల్సిన సంబంధిత అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. జిల్లా కేంద్రం పక్కనే ఉన్న నూతనకల్ మం డలాల పరిధిలోని ఏపూర్, మాచనపల్లి వద్ద ఉన్న పాలేరు వాగు నుండి పెద్ద ఎత్తున ఇసుకను తరలిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అలాగే నాగారం, తిరుమలగిరి, అర్వపల్లి మండల పరిధిలో ప్రవహిస్తున్న మూసి పరివాక ప్రాంతమైన బిక్కేరువాగునుండి, హుజూర్నగర్ నియోజకవర్గంలోని మఠంపల్లి, మేళ్ళచెరువు, చింతలపాలెం పరిధిలో ఉన్న క్రిష్ణా పరివాక ప్రాంతం, నేరేడుచర్ల సమీపంలోని చిల్లకల్లు సమీపంలో ఉన్న మూసీ పరివాక ప్రాంతం నుండి అక్రమార్కులు ఇసుకను యదేచ్చగా తోడేస్తున్నారు.
మోతే మండలం ఉర్లుగొండ, కూడలి, సమీపంలో ఉన్న తండాలలో ఉన్న వాగు ఈ ప్రాంతాల నుండి ప్రతి రోజు వేల సంఖ్యలో వాహనాల ద్వారా జిల్లా నలుమూలలకే కాకుండా హైదరాబాద్ మహానగరానికి కూ డా తరలిస్తున్నారు. కొంతమంది ప్రభుత్వ పనుల కోసమంటూ ఇసుక తరలింపుకు అనుమతులు తీసుకొని అడ్డదారిలో ఇతరులు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు.
సిండికేట్‌గా మారి..
ఇసుక మాఫీయా సిండికెట్‌గా మారి గతంలో రూ. 2వేల నుండి 3వేల వరకు దొరికే ట్రాక్టర్ ఇసుకను నేడు రూ. 4వేల నుండి 5వేల వరకు పెంచి విక్రయిస్తున్నారు. వాగుల నుండి సమీపంలోని పట్టణాలకు ఇసుకను రవాణా చేసేందుకు వారికి కేవలం రూ. 1500లకు మాత్రమే ఖర్చు అవుతున్న అమాంతం ధరలు పెంచి అమ్మడంతో సామాన్యుడికి ఇసుక అందుబాటులో లేకుండా పోయ్యింది. అధికారులు, పోలీసుల అండదండలతో మాఫియాల ఆటలు సాగుతున్నాయి.