19-03-2025 12:00:00 AM
జనగామ, మార్చి 18(విజయక్రాంతి): జనగామ పట్టణంలోని బాణాపురంలో గల చాకలి ఐలమ్మ నగర్‌లో ఇందిరమ్మ మూడో విడత లబ్ధిదారులు నిర్మించుకున్న గృహాలు నంబర్లు కేటాయించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి డిమాండ్, పట్టణ కార్యదర్శి జోగు ప్రకాశ్ చేశారు. పేదలు సొంతంగా ఇండ్లు నిర్మించుకోగా.. నంబర్లు కేటాయించకపోవడంతో ఆ ఇండ్లు నిరుప యోగంగా మారుతున్నాయని ఆవేదన వ్య క్తం చేశారు.
ఈ మేరకు మంగళవారం సీపీ ఎం ఆధ్వర్యంలో జనగామ --మున్సిపల్ కార్యా లయం ఎదుట భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 2013 లో కాంగ్రెస్ ప్రభుత్వం జనగామ పట్టణంలో ని ఇండ్లు లేని 1144 మందికి శామీర్‌పేట శివారులో పట్టాలు ఇచ్చిం దన్నారు. కానీ స్థలాలు చూపించలేదని, అప్పటికే బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిం దన్నారు.
ఇంటి నెంబర్లు వేయడంలో మునిసిపల్ అధికా రులు నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. ఈ విషయ మై అనేక దఫాలుగా పోరాటాలు నిర్వహిం చామన్నారు. ధర్నా అనంతరం జనగామ కమిషనర్ కు వినతిపత్రం ఇవ్వగా.. ఏప్రిల్ మొదటి వారంలో నంబర్లు వేస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు.
నంబర్లు వేయడంతో పాటు మౌలిక వసతులైన మంచినీరు, కరెంటు, రోడ్లు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఇర్రి అహల్య, బొట్ల శేఖర్ , బూడిది గోపి, బిట్ల గణేష్ , కళ్యాణం లింగం, ఎండి.గౌసియా, సౌందర్య, ధరావత్ మహేందర్, మీట్యానాయక్, సురేష్, సుధాకర్ , వెంకటేష్, ఉపేందర్ పాల్గొన్నారు.