28-04-2025 02:07:26 AM
గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ
మేడ్చల్, ఏప్రిల్ 27(విజయ క్రాంతి): ఆధునిక యుగంలో పతనమవుతున్న మానవత్వ, నైతిక విలువలను పెంపొందించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర గవర్నర్ జిష్టుదేవ్ వర్మ అన్నారు. ఇస్కాన్, తెలంగాణ అగర్వాల్ సమాజ్, డిఆర్‌ఎస్ స్కూల్ ఆధ్వర్యం లో గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని మైసమ్మగూడ డిఆర్‌ఎస్ ఇంటర్నేష నల్ స్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన ‘గీతా’ పఠనం వేసవి శిక్షణ శిబిరం2025’ను గవర్నర్ జిష్టుదేవ్ వర్మ ఆదివారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా గవర్నర్ జిష్టుదే వ్ వర్మ ప్రసంగిస్తూ ప్రపంచంలోని సమస్యలన్నింటికీ భగవద్గీత ఒక్కటే సమాధానమని, భగవద్గీత శ్లోకాలు మానవ జీవితానికి మార్గదర్శకాలని, వాటిని నిత్యం అభ్యాసం చేయ డం ద్వారా సమర్ధవంతమైన జీవితాన్ని జీ వించగలమన్నారు. నేటి బాలలే భావి భారత పౌరులని, వారికి ఎలాంటి శిక్షణను ఇస్తే అలాగే తయారవుతారని, చిన్నతనం నుంచే పిల్లలకు మానవత్వ, నైతిక విలువలను నేర్పించడం ద్వారా భవిష్యత్ వారు మెరుగైన భారతాన్ని నిర్మించగలరన్నారు.
చిన్న వయస్సులో వారు నేర్చుకునే విషయాల ఆధారంగానే వారి జీవన ప్రయాణం కొనసాగుతుందన్నారు. మనిషి జీవించి ఉన్నంత కాలం మంచి విషయాలను అభ్యా సం చేయాల్సిందేనన్నారు. భారతదేశానికి వందలాది ఏళ్ళ ఇతిహాస చరిత్ర ఉందని, ఆధ్యాత్మికంగా ఎలా ఎదగాలో ప్రపంపచమంతా భారతదేశాన్ని చూసి నేర్చుకునేలా మన ఆధ్యాత్మిక శిక్షణ ఉండాలన్నారు.
ఈ కార్యక్రమంలో ఇస్కాన్ కమ్యూనికేషన్ చైర్మ న్ యుధిష్టర్ గోవిందప్రభు, డీఆర్‌ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అంజనీ కుమార్ అగర్వాల్, కూకట్పల్లి విభాగం అధ్యక్షుడు మహాశ్రింగ దాస్ తదితరులు పాల్గొన్నారు .
భగవద్గీత శ్లోకాల పఠనంలో ప్రతిభ కనబరిచిన చిన్నారులను గవర్నర్ అభినందించి అవార్డులను అందజేశారు. వేసవి శిక్షణ శిబిరానికి వచ్చిన చిన్నా రులు పఠించిన భగవద్గీతలోని శ్లోకాలు సభికులను ఆకట్టుకున్నాయి. భగవద్గీత ప్రవచ నాలపై చిన్నారులు చేసిన నృత్యాలు సభికులను అలరించాయి.