14-03-2025 12:00:00 AM
పెద్ద ఎత్తున ప్రజా ప్రతినిధులు పాల్గొనాలని పిలుపునిచ్చిన ఆదివాసి కాంగ్రెస్ జిల్లా వైస్ చైర్మన్ భూక్య పద్మ
మహబూబాబాద్.మార్చి 13 (విజయక్రాంతి): ఈనెల 17 ,18, 19 తేదీల్లో రంగారెడ్డి జిల్లాలో జరిగే కులగనన ఆవశ్యకత ఆదివాసుల బా ధ్యత - వివిధ రాజకీయ పార్టీలు చేస్తు న్న కుట్రలు అనే అంశంపై ఆదివాసి కాంగ్రెస్ చైర్మన్ బెల్లయ్య నాయక్ ఆధ్వర్యంలో జరుగుతున్న సెమినార్లో ఏఐసిసి తెలంగాణ అధ్యక్షు రాలు మీనాక్షి నటరాజన్ పాల్గొంటుండగా రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు ఎంపీలు ముఖ్యంగా ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు అధికారులు పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆదివాసి కాంగ్రెస్ జిల్లా వైస్ చైర్మన్ భూక్య పద్మ కోరారు. ఈ సం దర్భంగా ఆమె మాట్లాడుతూ దేశంలోనే తొలిసారి సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో శాస్త్రీయంగా కులగనన జరిగిందని దేశవ్యాప్తంగా కులగనున చేయాల్సిన డిమాండ్ పెరిగినందున తెలంగాణ ప్రభుత్వం ఘనతను బలహీనపరచడం కోసం భాజపా వంటి పార్టీలు కుట్ర చేస్తున్నాయని బీసీ సంఘాలు కూడా వాటి ట్రాప్ లో పడిపోతున్నాయని అందువలన కాంగ్రెస్ నాయకులు అప్రమత్తంగా ఉండాలని ఈనెల 17 18 19 తేదీల్లో వికారాబాద్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ట్రైబల్ ట్రైనింగ్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు.