మంచిర్యాల (విజయక్రాంతి): మంచిర్యాల పట్టణంలోని ట్రినిటి పాఠశాలలో ఆదివారం ఎన్సిసి 'ఏ' సర్టిఫికెట్ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు మంచిర్యాలలోని ట్రినిటీ హై స్కూల్, గర్మిళ్ల ప్రభుత్వ హై స్కూల్, ప్రభుత్వ బాలికల పాఠశాల, హాజీపూర్ మండలంలోని సబ్బపల్లి ప్రభుత్వ పాఠశాల, దొనబండ పాఠశాలల నుంచి 141 మంది ఎన్సిసి క్యాండిడేట్లు ఎన్ సీ సీ 'ఏ' సర్టిఫికెట్ పరీక్షకు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జిఎన్సిసి అధికారులు రాజా నందం, ఆనందరావు, శ్రీనివాస్, శ్రీనివాసరావు, రాజని, శుభ తదితరులు పాల్గొన్నారు.