29-04-2025 04:20:34 PM
బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): మే 20న దేశవ్యాప్త బందును కార్మిక వర్గం విజయవంతం చేయాలని బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్(Building and Construction Workers Union) జిల్లా ఉపాధ్యక్షులు కొంకుల రాజేష్ కోరారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కాంట అంబేద్కర్ చౌరస్తా వద్ద మంగళవారం సమ్మె ప్రచార మీటింగ్లో మాట్లాడారు. కేంద్రంలో నరేంద్ర మోడీ తీసుకున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగడుతూ 44 కార్మిక చట్టాలను నాలుగు కోడ్లుగా మార్చడాన్నీ దేశంలోని ఏఐటీయూసీ అన్ని కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తూ మే 20న దేశవ్యాప్త బందుకు పిలుపునివ్వడం జరిగిందన్నారు. మే 20న మన బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్స్ వర్కర్స్ యూనియన్ మంచిర్యాల జిల్లా కార్మిక వర్గం అధిక సంఖ్యలో సమ్మెలో పాల్గొలన్నారు.
సమ్మెను విజయవంతం చేసి కార్మికుల పట్ల కటువుగా వ్యవహరించేటువంటి నరేంద్ర మోడీకి బుద్ధి చెప్పాలన్నారు. మే ఒకటో తారీఖున మే డే ను కార్మిక వర్గం అంతా ఒక పండుగ వాతావరణంలో జరుపుకొని అమరవీరులకు నివాళులర్పించి కొట్లాడి సాధించుకున్న హక్కులను చట్టాలను కాలరాసే ప్రక్రియకు చరమగీతం పాడే విధంగా బందును విజయవంతం చేయాలనీ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రం బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ బెల్లంపల్లి పట్టణ కార్యదర్శి ఆవునూరి రాజు, ఉపాధ్యక్షులు లింగపల్లి లింగన్న, చిప్పకుర్తి బాపు, పట్టణ కార్యవర్గ సభ్యులు కలగూర శంకర్, దేవునూరి కిషన్, నాయకులు రాజు ,శ్రీను, అజయ్, తదితరులు పాల్గొన్నారు.