calender_icon.png 4 March, 2025 | 10:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉచిత విద్య, వైద్యం అందించడమే నేషనల్ నవక్రాంతి పార్టీ లక్ష్యం

04-03-2025 07:57:32 PM

ముషీరాబాద్ (విజయక్రాంతి): ప్రతి ఒక్కరికీ ఉచిత విద్య, వైద్యం అందించడమే తమ పార్టీ ముఖ్య ఎజెండా అని నేషనల్ నవక్రాంతి పార్టీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు కనకం శ్రీనివాసరావు తెలిపారు. పార్టీ తొమ్మిదవ వార్షికోత్సవం సందర్భంగా మంగళవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన  మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా వచ్చే ఎన్నికల్లో ఎస్సి, ఎస్టి, బిసి అభ్యర్థులకు సిఎం సీటు కేటాయిస్తామని చెప్పారు. స్వామినాథన్ కమిటీ సిఫారసులు అమలు చేస్తామన్నారు.

రైతుల పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తామని, విత్తనాలు, ఎరువులు సబ్సిడీపై రైతును రాజును చేయటమే తమ పార్టీ లక్ష్యమన్నారు. యువతకు, మహిళలకు వడ్డీలేని రుణాలిచ్చి, స్వయం ఉపాధి కల్పించి, వారి ఆర్థికాభివృద్ధికి కృషిచేస్తామని పేర్కొన్నారు. 60 ఏండ్లు నిండిన వృద్ధులకు నేరుగా ఇంటికే వైద్య సేవలందిస్తామన్నారు. ఈ సమావేశంలో జాతీయ కార్యదర్శి లంకశేరి రాజ్ కుమార్, న్యాయవాది కన్నె రవి, పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఇంద్రగౌడ్ తదితరులు పాల్గొన్నారు.