06-03-2025 12:00:00 AM
కిసాన్ సంయుక్త మోర్చా నేతలు
చేవెళ్ల, మార్చి 5: జాతీయ వ్యవసాయ మార్కెట్ విధానాన్ని రద్దు చేయాలని, ఈ మేరకు అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం తీర్మాణం చేయాలని రైతు సంఘం నేతలు డిమాండ్ చేశారు. బుధవారం రాష్ట్ర రైతు సంఘం కిసాన్ సంయుక్త మోర్చా ఆధ్వర్యంలో ఆర్డీవో ఆఫీసు ముందు ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రభులింగం, జిల్లా అధ్యక్షుడు మాధవ రెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు సుధాకర్ గౌడ్ మాట్లాడుతూ.. రైతుల పోరాటంతో కేంద్రం గతంలో ఉపసంహరించుకున్న రైతు వ్యతిరేక చట్టాలను మళ్లీ అమలు చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
జాతీయ వ్యవసాయ మార్కెట్ విధానం అమలైతే దేశవ్యాప్తంగా ఉన్న వ్యవసాయ మార్కెట్లు తొలగిపోతాయని, రైతులు ప్రైవేటు వ్యాపారుల వద్ద అతి తక్కువ ధరలకు పంటలను అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
ధర్నాలో నేతలు రాష్ట్ర నేతలు పశ్యపద్మ, పి. నాగిరెడ్డి, జిల్లా నాయకులు ఎం. శివుడు, నారాయణరెడ్డి, సత్తిరెడ్డి, నరసయ్య, సుభాన్ రెడ్డి, జే. అంజయ్య, పి. సుధీర్ అమృత తదితరులు పాల్గొన్నారు.