calender_icon.png 20 April, 2025 | 11:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొత్తవారి పేర్లు గట్టిగా వినిపిస్తాయ్

11-04-2025 12:00:00 AM

టీవీ యాంకర్ ప్రదీప్ మాచిరాజు హీరోగా నటిస్తున్న చిత్రం ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’. యువ దర్శకులు డుయో నితిన్, భరత్ తెరకెక్కిస్తున్నారు. దీపికా పిల్లి కథానాయికగా నటిస్తోంది. ఏప్రిల్ 11న థియేటర్లలోకి రానుందీ సినిమా. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీ రిలీజ్ ప్రెస్‌మీట్ నిర్వహించారు. హీరో ప్రదీప్ మాట్లాడుతూ... “ఈ సినిమాతో చాలా మంది కొత్తవారు పరి చయం అవుతున్నారు.

రిలీజ్ తర్వాత వాళ్ల పేర్లు గట్టిగా వినిపిస్తాయి. మా సినిమా మొట్టమొద టి టికెట్‌ను రామ్‌చరణ్ కొనుగోలు చేయడం ఆనందాన్నిచ్చింది. ఆయన ‘పెద్ది ఫర్ ప్రదీప్’ అని చెప్పడం నా అదృష్టంగా భావిస్తున్నా” అన్నారు. హీరోయిన్ దీపిక మాట్లాడుతూ.. ‘నేను లీడ్ యాక్టర్‌గా చేసిన ఫస్ట్ సినిమా ఇది. ఇంత మంచి క్యారెక్టర్ చేయడం ఒక అదృష్టంగా భావిస్తున్నా’ అని చెప్పింది.

డైరెక్టర్ భరత్ మాట్లాడుతూ... ‘రామాయణంలో ఉడతను శ్రీరాములవారు ఎలా ఎలివేట్ చేశారో.. మా సినిమాను రామ్‌చరణ్ అంతలా ఎలివేట్ చేశారు’ అన్నారు. మరో దర్శకుడు నితిన్ మాట్లాడుతూ.. ‘మంచి టీమ్‌వర్క్‌తో చేసిన సినిమా ఇది’ అని తెలిపారు.