పాలస్తీనియన్లకు సంఘీభావంగా..
సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కాంగ్రెస్
అది బుజ్జగింపుల సంచి : బీజేపీ
న్యూఢిల్లీ, డిసెంబర్ 16: కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకగాంధీ పార్లమెంట్‌లోకి సోమవారం పట్టుకుని వచ్చిన బ్యాగు అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ బ్యాగుపై ‘పాలస్తీనా’ అని ఇంగ్లీషులో రాసి ఉంది. ఆ బ్యాగుపై పాలస్తీనియన్లకు సంఘీభావాన్ని సూచించే చిహ్నాలు ఉన్నాయి. అక్టో బర్ 7 ఘటన తరువాత ఇజ్రాయెల్ దాడులతో బాధపడుతున్న పాలస్తీనా ప్రజలకు సంఘీభావంగా ఆమె దానిని తీసుకువచ్చారు. ఈ ఫొటోను కాంగ్రెస్ అధికార ప్రతినిధి షామా మహమ్మద్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
గతవారమే పాలస్తీనా రాయబారిని ఆమె కలు సుకుని గాజా వివాదం పై చర్చించారు. గాజాలో ఇజ్రాయెల్ చర్యలు అనాగరికం అని గతంలో ఆమె విమర్శించారు. ఈ సందర్భంగా ప్రియాంకపై బీజేపీ ఆరోపణలు గుప్పించింది. గాంధీ కుటుంబం ఎప్పుడూ బుజ్జగింపుల సంచిని మోసుకుంటోందని, ఎన్నికల్లో వారి ఓటమికి ఆ బుజ్జగింపుల సంచే కారణమని బీజేపీ నాయడకు సంబిత్ పాత్ర విమర్శించారు. అయితే బీజేపీ ఆరోపణపై ఆమె స్పంది స్తూ బంగ్లాదేశలో హిందువులపై జరుగుతున్న ఆకృత్యాలపై ఏదో ఒకటి చేయాల ని, ఇందుకోసం బంగ్లా ప్రభుత్వంతో మాట్లాడాలని సూచించారు.