యువ కథానాయకుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రస్తుతం తన కెరీర్‌లో 12వ సినిమా కోసం పనిచేస్తున్న సంగతి తెలిసిందే. కొత్త డైరెక్టర్ లుధీర్ బైరెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మూన్‌షైన్ పిక్చర్స్ బ్యానర్‌పై మహేశ్ చందు నిర్మిస్తున్నారు. శతాబ్దాల నాటి దశావతార ఆలయం చుట్టూ అల్లుకున్న కథతో రూపొందుతున్న ఈ సినిమాలో సంయుక్త ఫీమేల్ లీడ్‌గా నటిస్తోంది.
ఇప్పటికే 35 శాతం షూటింగ్ పూర్తయిన ఈ సినిమాకు సంబంధించి పోస్టర్లతో ప్రేక్షకుల్లో అంచనాలను పెంచేసింది చిత్రబృందం. తాజాగా హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పుట్టిన రోజును పురస్కరించుకొని బుధవారం మూవీ గ్లింప్స్ విడుదల చేసింది. ఇందులో బెల్లంకొండ శ్రీనివాస్ రగ్గడ్, పవర్‌ఫుల్, మాచో అవతార్ అదిరిపోయింది. కొందరు దుండగులు పవిత్ర దశావతార ఆలయాన్ని ధ్వంసం చేసే ప్రయత్నాన్ని హీరో అడ్డుకోవడాన్ని చూపించారు.
ఇప్పటివరకు ‘బీబీఎస్12’గా ప్రచారంలో ఉన్న ఈ సినిమా టైటిల్‌ను ఈ వీడియో చివరలో హిందూయిజం సారాంశంతో ప్రతిధ్వనించే ‘హైందవ’గా రివిల్ చేశారు. మొత్తంగా విష్ణు అవతారాలు, నామాలు బ్యాక్‌డ్రాప్‌లో డైరెక్టర్ లుధీర్ బైరెడ్డి డైరెక్షన్, విజన్ కట్టిపడేసింది. ఈ చిత్రానికి సమర్పణ: శివన్ రామకృష్ణ; డీవోపీ: శివేంద్ర; సంగీతం: లియోన్ జేమ్స్; ఎడిటర్: కార్తీక శ్రీనివాస్ ఆర్; ఆర్ట్: శ్రీనాగేంద్ర తంగాల.