calender_icon.png 29 December, 2024 | 9:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రతిభ కనబర్చి జిల్లా పేరు నిలపాలి

28-12-2024 06:31:33 PM

ఆదిలాబాద్ (విజయక్రాంతి): సీఎం కప్ 2024 లో భాగంగా 2వ విడత జిల్లా లెవెల్ లో విజేతలైన క్రీడాకారులు రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనేందుకు వెళ్తున్న సందర్భంగా యూనిఫాం, టీ షర్ట్ లను జిల్లా కలెక్టర్ రాజర్షి షా తన క్యాంప్ కార్యాలయంలో శనివారం అందజేసి బెస్ట్ ఆఫ్ లక్ తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో జరుగుతున్న సీఎం కప్ 2024 లో గ్రామ, మండల, జిల్లా స్థాయి క్రీడా పోటీలలో విజేతలుగా నిలిచి రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలలో పాల్గొంటున్న క్రీడాకారులు రాష్ట్ర స్థాయి క్రీడల్లో రాణించి జిల్లా పేరు నిలపాలని ఆకాంక్షించారు.

ఈనెల 26న మొదటి బ్యాచ్ హైదారాబాద్, మహబూబ్ నగర్, మెదక్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, హన్మకొండ జిల్లాలకు 276 మంది క్రీడాకారులను పంపించడం జరిగిందనీ, 2వ విడత విజేతలైన క్రీడాకారులను 29, 30వ తేదీలలో అదే జిల్లాలకు ఆర్టీసీ ద్వారా ఏర్పాటు చేసిన బస్ లలో పంపించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి వెంకటేశ్వర్లు, గిరిజన క్రీడల అభివృద్ధి అధికారి పార్థసారథి తదితరులు ఉన్నారు.