calender_icon.png 21 November, 2024 | 4:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎఫ్‌ఐఆర్ నుంచి చనిపోయిన వ్యక్తి పేరు తొలగించాం

21-11-2024 03:25:05 AM

ఓ వర్గం కావాలనే తప్పుడు ప్రచారం చేస్తోంది

మెదక్ ఎస్పీ ఉదయ్‌కుమార్ రెడ్డి

మెదక్, నవంబర్ 20(విజయక్రాంతి): పోలీసులను అబాసుపాలు చేసే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని మెదక్ ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి హెచ్చరించారు. బుధవారం ఓ ప్రకటనలో నర్సాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చనిపోయిన వ్యక్తిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారని వచ్చిన కథనాలపై స్పందించారు. సెప్టెంబర్ 23న ఓ భూ వివా దం విషయంలో ఫిర్యాదు రాగా.. ముందు గా ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని, ఆ తర్వాత పోలీసుల విచారణలో పాత్లోత్ విఠల్ అనే వ్యక్తి ఫిర్యాదు కంటే ముందే చనిపోయాడని తెలు సుకొని అత డి పేరును తొలగించినట్లు చె ప్పారు.

మళ్లీ ఈ నెల 8న ఇదే కేసుకు సంబంధించి ఫిర్యాదు రాగా కేసు నమోదు చేశామని, అయితే గతంలో నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను ఆధారంగా తీసుకొని ఓ వర్గం పోలీసులను అబాసుపాలు చేసేందుకు ప్రయత్నించి మీడియా, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని వాపోయారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.