calender_icon.png 18 January, 2025 | 9:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆదిలాబాద్ పేరు నిలబెడతా

11-08-2024 12:05:00 AM

ఆదిలాబాద్, ఆగస్టు 10 (విజయక్రాంతి): ఆదిలాబాద్ వాస్తవ్యుడైన చిలుకూరి ఆకాశ్‌రెడ్డి తీసిన తొలి చిత్రం ‘అలనాటి రామచంద్రుడు’ ఈ నెల 2 న విడుదలైంది. సినిమా సక్సెస్ అయిన నేపథ్యంలో శనివారం ఆదిలాబాద్ జిల్లాకేంద్రానికి వచ్చిన ఆకాశ్‌రెడ్డి స్థానిక విలేకరులతో మాట్లాడారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో తన సినిమా ప్రస్తుతం విజయవంతంగా అడుతోందని తెలిపారు. సినీ రంగంలో ఆదిలాబాద్ పేరు మార్మోగేలా చేస్తానని అన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని మంచి సినిమాలు అందిస్తానని చెప్పారు.