calender_icon.png 10 January, 2025 | 9:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేరు గొప్ప.. ఊరుదిబ్బ

13-09-2024 12:00:00 AM

తెలంగాణలో చారిత్రకంగా బాగా ప్రసిద్ధి చెందిన ఊళ్లలో సైతం ఎలాంటి అభివృద్ధి  కనబడడం లేదు. సంవత్సరాలు గడుస్తున్నా ఆ ఊళ్లలో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంటోంది. ఏదో సందర్భంలో ప్రముఖులు వచ్చినప్పు డు అభవృద్ధికి సంబంధించి ఏవోవో వాగ్దానాలు ఇవ్వడం ఆ త ర్వాత మర్చిపోవడం సర్వ సాధారణంగా మారింది.  చేనేత పరిశ్రమకు ఎంతో ప్రసిద్ధి చెందిన పోచంపల్లి దీనికో ఉదాహరణ. రాష్ట్ర రాజధానికి కూత వేటు దూరంలో ఉన్నా, దేశ పటంలో స్థానం సం పాదించినాఈ ఊరు అభివృద్ధి చెందాల్సిన స్థాయిలో అభివృద్ధి చెందలేదు. కొలనుపాక క్షేత్రంది కూడా ఇదే దుస్థితి.

కనీస సదుపాయాలైన రోడ్లు, డ్రైనేజి వ్యవస్థ లాంటివి కూడా సరిగా ఉం డడం లేదు. ఇక రవాణా సదుపాయం కూడా అంతంతమాత్రమే. చాలా సంవత్సరాల తర్వాత ఇలాంటి ఊళ్లకు వచ్చిన వాళ్లు అభివృద్ధి ఆశించిన స్థాయిలో లేకపోవడం చూసి ఆశ్చర్యపోతున్నారు. కాలక్రమంలో అభివృద్ధి అనేది ఏ ఊరిలోనైనా కనిపించాలి. కేం ద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి గ్రామాల కోసం ఎప్పుడో నిధులు కేటాయించి ఉండాలి. ఇప్పటికయినా ప్రభుత్వాలు ఈ విషయంపై దృష్టిపెట్టాలి. షేక్ అస్లాం షరీఫ్, శాంతినగర్