- రామగుండంలో ఇరుకైన రోడ్లతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు
- పట్టించుకోని ప్రజాప్రతినిధులు, అధికారులు
- రోడ్ల వెడల్పు ఎప్పుడో... ట్రాఫిక్ కష్టాలు తీరేదెన్నడో..
రామగుండం, జనవరి 7: పేరు గొప్ప... ఊరు దిబ్బ.. అన్నట్టు ఉంది రామగుండం పరిస్థితి. మాన్ సిస్టర్ ఆఫ్ ఇండియాగా పే రొందిన రామగుండంలో... అన్నీ ఉన్న.. అల్లుని నోట్లో శని అన్న చందంగా తయా రైంది. ప్రజా ప్రతినిధులు మారిన... అధికా రులు మారిన... రామగుండం రూపురేఖలు మాత్రం మారడం లేదన్న అపవాదు కూడా ఉంది.
రోడ్ల వెడల్పు దేవుడు ఎరుగు... ఉన్న రోడ్లే పూర్తిగా శిథిలావస్థలో ఉండి ఏజెన్సీ ప్రాంతం కంటే మరి అధ్వానంగా తయారైం ది. రోడ్లు సక్రమంగా లేక నగర ప్రజలు అనేక ఏళ్లుగా ట్రాఫిక్ కష్టాలు ఎదుర్కొంటు న్నారు. పెద్దపెల్లి జిల్లా రామగుండం నియో జకవర్గంలో గత కొన్ని ఏళ్లుగా వేసిన ఇరుకైన రోడ్లతో ఆ పారిశ్రామిక ప్రాంతాల లోని ప్రజలు రోడ్లపై ప్రయాణించాలంటే నరకయాతన పడుతున్నారు.
రోజురోజుకు పెరుగుతున్న వాహనాలతో వాహనాలకు తగ్గట్లు రోడ్లను వెడల్పు చేయకపోవడంతో పారిశ్రామిక ప్రాంతమైన రామగుండంలోని 5వ డివిజన్ లో ఇరుకైన రోడ్ల తో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం ఈ ఇరుకైన రోడ్లపై అనేకమైన పోలీస్ వాహనా లతో పాటు (సిఐఎస్‌ఎఫ్) వాహనాలు, ఎన్టి పిసి ఉద్యోగస్తులు, సింగరేణి కార్మికులు, డివిజన్ ప్రజలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు ఈ రోడ్ల పై వెళ్లాలంటే అనేక ఇబ్బందులు పడుతున్నారు.
ప్రభుత్వా లు మారిన రోడ్లు వెడల్పు చేయక పోవడం తో కొన్ని ఏళ్లుగా ఈ ఇరుకైన రోడ్లతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా సంబం ధిత అధికారులు ప్రత్యేక చొరవ తీసుకుని ఈ రోడ్లను వెడల్పు చేసి ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలని ప్రజా ప్రతినిధులను అధి కారులను ప్రజలు కోరుతున్నారు.