బాలీవుడ్ దర్శకురాలు కిరణ్ రావు రూపొందించిన చిత్రం ‘లాపతా లేడీస్’. ఇది 2025 ఆస్కార్ బరిలో నిలిచింది. దీనిలో భాగంగా చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాలను చేపట్టింది. అయితే సినిమా టైటిల్‌ను ‘లాస్ట్ లేడీస్’గా మేకర్స్ పేరు మార్చారు. హాలీవుడ్ ఆడియన్స్‌కు ‘లాపతా లేడీస్’ పలకడం కష్టమవుతుందని.. సులభంగా పలికే లా ‘లాస్ట్ లేడీస్’ అని పేరు మార్చినట్టు మేకర్స్ తెలిపారు.
2001లో జరిగిన యథార్థ ఘటనల ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. గ్రా మీణ ప్రాంతానికి చెందిన ఇద్దరు నవ వధువులు రైల్లో అనుకోకుండా తారుమారవడం.. ఆ తరువాత జరిగే పరిణామాల ఆధారంగా సినిమాను రూపొందింది. సినిమాలో నితాన్షి గోయల్, స్పర్శ్ శ్రీవాస్తవ్ ప్రధాన పాత్రల్లో నటించారు.
చిత్ర నిర్మాత అమిర్ మీడియాతో మా ట్లాడుతూ.. “లపతా లేడీస్’ కోసం ఆస్కార్ క్యాంపెయిన్‌కు రావడం ఆనందంగా ఉంది. ఆస్కార్ అకాడమీలో ఉండే ప్రత్యేక కమిటీలు తమకు కేటాయించిన 80 శాతం సినిమాలను మాత్రమే చూస్తారు. కాబట్టి మన సినిమాలను మనమే ప్రమోట్ చేసుకోవాలి” అన్నారు.