గోళ్లు అందంగా కనిపించడానికి వాటికి నెయిల్ పాలీష్ వేస్తుంటారు. ఇంకాస్త కొత్తగా కనిపించాలంటే డిజైన్లు కూడా వాడుతుం టారు. కానీ గోళ్లకూ అందమైన రింగ్స్ తొడిగేస్తున్నారు మహిళలు. అదే ప్రజెంట్ ట్రెండ్. వేళ్లకి పెట్టుకున్నట్టే గోళ్లకూ ఉంగరాలు పెట్టుకోవచ్చు. గోరు మొత్తాన్ని కవర్ చేస్తూ కనిపించే ఈ నెయిల్ రింగ్స్ రెండు వేళ్లకు లేదా మొత్తం వేళ్లకు పెట్టుకోవచ్చు. గోళ్లకు చివర కూడా పెట్టుకునే రింగ్స్ వచ్చాయి. ఇప్పటివరకు వేళ్లకే ఉన్న ఉంగరాలు కాస్తా ఇంకాస్త ముందుకు జరిగి గోళ్లపై హొయలుపోతున్నాయి. గోళ్ల మీద నక్షత్రాలు, కీ చెయిన్లలా ఉండే డిజైన్లు ఆకట్టుకుంటున్నాయి. అలాగే బంగారం, వెండి, స్టీల్‌తో తయారయ్యే ఈ నెయిల్ రింగ్స్ మరింత మెరుపులు తీసుకొస్తున్నాయి. పార్టీలు, ఫంక్షన్లలో తమ కాస్ట్యూమ్స్ డిజైన్స్‌కు తగ్గట్టుగా నెయిల్ రింగ్స్ వాడుతూ ప్రత్యేక ఆర్షణగా నిలుస్తున్నారు.