calender_icon.png 6 October, 2024 | 4:13 AM

పదేళ్ల బాలికపై హత్యాచారం!

06-10-2024 01:28:35 AM

నాలాలో మృతదేహం లభ్యం 

పోలీస్ స్టేషన్‌ను తగులబెట్టిన ఆందోళనకారులు

కోల్‌కతా, అక్టోబర్ 5: పశ్చిమ బెంగాల్ లో వైద్య విద్యార్థిని హత్యాచార ఉదంతంపై నిరసనల సెగ చల్లారకముందే మరో దా రుణ ఘటన చోటుచేసుకుంది. ట్యూషన్‌కు వెళ్లి అదృశ్యమైన బాలిక మరుసటి రోజు ఇం టి సమీపంలోని కాలువలో శవమై తేలింది.

దీంతో పోలీసుల నిర్లక్ష్యంపై గ్రామస్తులు కోపోద్రిక్తులై పోలీస్ స్టేషన్‌కు నిప్పుపెట్టారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం దక్షిణ 24 పరగణాల జిల్లా మహిషామరి గ్రామానికి చెందిన 10 ఏళ్ల బాలిక ౪వ తరగతి చదువుతోంది. శుక్రవారం ట్యూషన్‌కు వెళ్లిన బాలిక తిరిగి ఇంటికి రాలేదు. ఆందోళన చెందిన కుటుం బసభ్యులు మహిషామారి పోలీస్ క్యాంప్ వద్దకు వెళ్లి ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా.. జయనగర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయాలంటూ అక్కడి పోలీసులు తెలిపారు.

ట్యూషన్ నుంచి వస్తుండగా కిడ్నాప్

కాగా.. శనివారం తెల్లవారుజామున ఇంటి సమీపంలోని కాలువలో బాలిక మృతదేహం లభించింది. ట్యూషన్ నుంచి తిరిగి ఇంటికి వస్తుండగా అపహరించిన దుండగులు ఆమెపై లైంగికదాడి చేసి చంపేశారని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. కేసు నమోదు చేసి బాలిక ఆచూకీని కనుగొనడంలో పోలీసుల నిర్లక్ష్యంపై ఆగ్రహించిన కుటుంబ సభ్యులు, స్థానికులు.. మహిషామరి పోలీస్ స్టేషన్‌పై దాడిచేసి స్టేషన్‌లోని సామగ్రిని ధ్వంసం చేశారు.

అనం తరం స్టేషన్‌కు నిప్పు పెట్టారు. పోలీసులు అదనపు బలగాలను రప్పించి పరిస్థితిని నియత్రించారు. కాగా బాలిక కిడ్నాప్, హత్య కు సంబంధించి అనుమానితుడిని పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం. బెంగా ల్‌లో వరుస కేసులు నమోదవుతుండటంపై బీజేపీ.. అధికార టీఎంసీపై విమర్శలు గుప్పిస్తోంది. ఇన్ని అఘాయిత్యాలు జరుగుతున్నా బెంగాల్ ప్రభుత్వం నిందితులపై చర్యలు తీసుకోకపోవడం ఏంటని మండిపడ్డారు.