calender_icon.png 26 December, 2024 | 6:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డబ్బులు ఎగొట్టేందుకే దివ్యాంగుడి హత్య

05-11-2024 01:18:15 AM

లింగంపల్లి హత్య కేసు నిందితుడి అరెస్ట్ 

కామారెడ్డి, నవంబర్ 4 (విజయక్రాంతి): ఇచ్చిన డబ్బులను ఎగొట్టేం దుకే నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం ధర్మారం గ్రామానికి చెంది న దివ్యాంగుడు కృష్ణను కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం లింగంపల్లి శివారులో గత నెల 31న హత్య చేసినట్టు పోలీసులు తెలిపారు. సోమవారం నిందితున్ని అరెస్ట్ చేసి రిమాం డ్‌కు తరలించారు.

ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్‌లు సదాశివనగర్ పోలీస్‌స్టేషన్‌లో వివరాలను వెల్లడించారు. లిం గంపేట మండలం కొర్పోల్ గ్రామానికి చెందిన గంగాధర్‌తో గత 9 సంవత్సరాలుగా ధర్మారంకు చెందిన కృష్ణకు పరిచయం ఉంది. గంగాధర్ దుబాయ్ వెళ్లే సమయంలో కృష్ణ భార్యకు చెందిన నాలుగు తులాల బంగారం అప్పుగా తీసుకున్నాడు.

దివ్యాంగుడైన కృష్ణను హత్య చేస్తే బంగారం తిరిగి ఇవ్వాల్సిన అవసరం ఉండదనుకున్న గంగాధర్ సదాశివనగర్ మండలం లింగంపల్లి గ్రామశివా రులో గత నెల 31న హత్య చేశాడు. కృష్ణ బార్య లావణ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు గంగాధర్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగికరించినట్లు డీఎస్పీ తెలిపారు.