calender_icon.png 9 January, 2025 | 1:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మున్సిపాలిటీ పోయింది.. మండలం కూడా పోయేటట్టుంది!

07-01-2025 12:00:00 AM

కరీంనగర్, జనవరి 6 (విజయక్రాంతి): కరీంనగర్ను ఆనుకొని ఉన్న కొత్తపల్లిని చుట్టుపక్కల గ్రామాలను కలుపుకొని గత ప్రభుత్వం మొదట మండలంగా, ఆతర్వాత కొత్తపల్లి వరిధిని పట్టణంగా ఏర్పాటు చేసిం ది. గత ఎన్నికల్లో కొత్తపల్లి మున్సిపాలిటీ పాలకవర్గం కూడా ఏర్పాటయింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా కొత్తపల్లి మున్సి పాలిటీని కరీంనగర్ నగరపాలక సంస్థలో కలుపుతూ ఉత్తర్వులు జారీ చేసింది.

కొత్తప ల్లి పట్టణాన్నే కాకుండా కొత్తపల్లి మండల పరిధిలోని మల్కాపూర్, చింతకుంట గ్రామా లను కూడా కరీంనగర్ కార్పొరేషన్లో విలీనం చేయడంతో కొత్తపల్లి మండలం కూడా రద్దు కానుందని ప్రచారం జరుగుతుంది. గతంలో ఇదే మండల పరిధిలో ఉన్న బావుపేటను మండలంగా చేయాలన్న డిమాండ్ ప్రజల నుండి వచ్చింది. తాజాగా ఎలగందల్ను కూ డా మండల కేంద్రంగా చేయాలనే డిమాండ్ అక్కడి నేతల నుండి వస్తుంది.

కొత్తపల్లి మండలంలో అత్యధిక జనాభా ఉన్న గ్రా మం బావుపేట, దీన్ని మండలంగా చేసి ప్ర స్తుతం కొత్తపల్లి మండల పరిధిలో మిగిలిన గ్రామాలను దీని పరిధికి తీసుకురావాలని అక్కడి ప్రజలు డిమాండ్ చేస్తుండగా, కరీం నగర్ తొలి రాజధాని అయిన ఎలగందల్కు ఉన్న చారిత్రక నేపథ్యంతోపాటు నగరానికి ఆనుకొని ఉన్న పంచాయతీ కావడంతో ఎలగందల్ను కూడా మండల కేంద్రం చే యాలనే డిమాండ్ తెరమీదకు వచ్చింది.

గంగాధర మండలానికి దూరంగా ఉండి, బావుపేట సమీపంలో ఉన్న ఒద్యారం గ్రా మాన్ని బావుపేటను మండల కేంద్రంగా చేసి అందులో విలీనం చేయాలన్న ప్రతిపాద నను ముందుంచుతున్నారు. బావుపేట ప్రజలు ఇటీవల ధర్నా చేసి మంత్రి పొన్నం ప్రభాకర్ను కలిసి విజ్ఞప్తి చేశారు. ఎలగందల్ గ్రామాన్ని మండల కేంద్రంగా చేస్తే టూరిజం కేంద్రంగా మరింత అభివృద్ధి చెందుతున్న ఆశ అక్కడివారిలో ఉంది.

ప్రస్తుతం ఎలగందల్ ఖిల్లాకు వెళ్లాలంటే కమాన్పూర్ దాటి వెళ్లవలసి ఉంటుంది. కరీంనగర్, ఎలగందుల మధ్య మానేరు కాకతీయ కాలు వపై వారధిని నిర్మిస్తే ఎలగందల్ కరీంన గర్కు మరింత దగ్గరవుతుంది. అయితే గత ప్రభుత్వంలో ఈ పనులు ప్రారంభమైన కోర్టు కేసులు తదితర కారణాలవల్ల మధ్య లో ఆగిపోయింది. తాజాగా ఈ డిమాండ్ కూడా తెరమీదకు వచ్చింది.

వారధి నిర్మించి న అనంతరం ఎలగండల్ కూడా ఈరోజు కాకపోతే రేపో నగరపాలక సంస్థలో కలిసి పోతుంది కనుక బావుపేటనే మండలం చేయాలని అక్కడి వారు డిమాండ్ చేస్తున్నా రు. ఉమ్మడి జిల్లాలో పలు పంచాయతీలను మండలాలు చేయాలనే డిమాండ్ ప్రభుత్వ ప్రతిపాదనలో ఉండడంతో తాజాగా ఈ రెం డు పంచాయతీల గ్రామస్తులు కూడా తమ డిమాండ్ను మంత్రి ముందుంచారు.

మంత్రి పొన్నం ప్రభాకర్ తీసుకునే నిర్ణయంతోనే ఆధారపడి ఉంటుంది. ఇదిలా ఉంటే మున్సి పాలిటీ పోయి కార్పొరేషన్లో విలీనం చేసిన అనంతరం కొత్తపల్లివారు కనీసం మండల మైనా ఉంచాలని డిమాండ్‌ను వినిపి స్తున్నారు.