హుజురాబాద్ (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని స్థానిక హై స్కూల్ గ్రౌండ్ లో మంగళవారం మున్సిపల్ చైర్ పర్సన్ గందే రాధిక-శ్రీనివాస్ హైమాక్స్ లైట్స్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... హుజురాబాద్ పట్టణ అభివృద్ధికి కోటి యాభై లక్షల నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. పట్టణంలో పలు వార్డులలో సిసి రోడ్లు, డ్రైనేజీ లకు ఈ నిధులను ఉపయోగించినట్లు తెలిపారు. స్థానిక హై స్కూల్ గ్రౌండ్ లో వాకర్స్ సౌకర్యార్థం ఐదు లక్షలతో హైమాక్స్ లైట్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పట్టణ వాసులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, కౌన్సిలర్లు అపరాజ ముత్యరాజు, తాళ్లపల్లి శ్రీనివాస్, తోగరు సదానందం, కిషన్, రమేష్ కుమార్, రమాదేవి, లావణ్య, వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గోవర్ధన్ తో పాటు వాకర్సు పాల్గొన్నారు.