calender_icon.png 28 April, 2025 | 10:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘గౌరవెల్లి’లో తట్టెడు మట్టి ఎత్తలే

28-04-2025 01:22:37 AM

  1. మేం తొంభై శాతం పనులు పూర్తి చేసినం
  2. ఏడాదిన్నరల పదిశాతం కంప్లీట్ చేయసెతగాదా? 
  3. బీఆర్‌ఎస్ రజతోత్సవం సభ హుస్నాబాద్‌లో ప్రస్తావన
  4. కాంగ్రెస్ సర్కార్‌పై మాజీ సీఎం కేసీఆర్ ఫైర్

హుస్నాబాద్, ఏప్రిల్ 27 : ‘మేం హుస్నాబాద్ నియోజకవర్గంలో గౌరవెల్లి ప్రాజెక్టు పనులు తొంభై శాతం పూర్తి చేసినం. కాంగ్రెస్ సర్కారు వచ్చి తట్టెడు మట్టి కూడా ఎత్తలేదు. హరీశ్ రావు ఇరిగేషన్ మంత్రిగా, వొడితల సతీశ్ కుమార్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గౌరవెల్లి ప్రాజెక్టు పనులు రాకెట్ స్పీడుతో నడిచినయ్. ట్రయల్ రన్ కూడా సక్సెస్ అయ్యింది. కానీ, ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు వచ్చి మొత్తం నాశనం చేసింది.

ఎమ్మెల్యేల నుంచి మంత్రుల దాకా అందరూ కమీషన్లు తీసుకుంటున్నరు. ఇరవై నుంచి ముప్పు శాతం కమీషన్లకు ఎగబడ్డరు‘ అని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని ఎల్కతుర్తిలో ఆదివారం జరిగిన పార్టీ రజతోత్సవ సభలో హుస్నాబాద్ నియోజకవర్గం అభివృద్ధి గురించి మాజీ ముఖ్య మంత్రి కేసీఆర్ మాట్లాడారు.

తెలంగాణ కోసం తమ పార్టీ చేసిన పోరాటం, రాష్ట్రాన్ని సాధించాక అధికారంలోకి వచ్చి ప్రజల కోసం ఎలా బాధ్యతగా పనిచేశామో, ఇప్పు డు కాంగ్రెస్ ఎలా మోసం చేస్తోందో వివరించారు. కాంగ్రెస్ సర్కారుపై తీవ్ర విమర్శలు చేస్తూ ఇలా అన్నారు. ‘గౌరవెల్లి ప్రాజెక్టు పనులు 90 శాతం పూర్తి చేసినం. ట్రయల్ రన్ కూడా సక్సెస్ అయింది.

కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును పట్టించుకోవడం లేదు. ప్రాజెక్టు పనులు ముందుకు సాగడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది. ఎమ్మెల్యేల నుంచి మంత్రుల వరకు అందరూ కమీషన్లు తీసుకుంటున్న రు. 20 నుంచి 30 శాతం కమీషన్లు దండుకుంటున్నరు. రైతుల రుణమాఫీ హామీని కూడా నెరవేర్చలేదు. రైతుబంధు కింద పెట్టుబడి సాయాన్ని కూడా ఇవ్వలేదు.

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను మరిచి పోయిండ్రు. కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పింది, మడమ తిప్పింది. బీఆర్‌ఎస్ ప్రభుత్వం హయాంలో హుస్నాబాద్ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందింది. కానీ, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని పనులను ఆపేసింది. ప్రజల కోసం చేసిన మంచి పనులను కూడా మర్చిపోయారు.

కాంగ్రెస్ ప్రభు త్వం తమ జేబులు నింపుకోవడంలోనే బిజీగా ఉంది‘ అని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇంకా, ‘బీఆర్‌ఎస్ సర్కారు ఉన్నప్పుడు హుస్నాబాద్ ప్రాంతం ఎంతో అభి వృద్ధి చెందింది. కానీ, ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు వచ్చి అన్ని పనులను ఆపేసింది. జనం కోసం చేసిన మంచి పనులన్నింటినీ మర్చిపోయి, తమ జేబులు నింపుకోవడంలోనే బిజీగా ఉన్నారు‘ అని విమర్శించారు.