26-02-2025 07:59:28 PM
కల్యాణ్, సోఫియా ఖాన్, ఊహ హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం ‘ఎ స్టార్ హీరో ఈజ్ బార్న్’. వీజే సాగర్ దర్శకత్వం వహిస్తున్నారు. సీఆర్ ప్రొడక్షన్, వీజే ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్స్‌పై రవిసాగర్, వీజే సాగర్ ఈ చిత్నాన్ని నిర్మిస్తున్నారు. మహాశివరాత్రి సందర్భంగా ఈ సినిమా నుంచి ప్రముఖ నటుడు, దర్శకుడు, రచయిత తనికెళ్ల భరణి చేతుల మీదుగా ‘ఓం నమః శివాయ’ అనే లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు. తనికెళ్ల శంకర్ రాసిన ఈ పాటను చిత్రానికి సంగీత సారథ్యం వహిస్తోన్న సునీల్ కశ్యప్ ఆలపించారు. ఈ సందర్భంగా.. తనికెళ్ల భరణి మాట్లాడుతూ “ఎ స్టార్ హీరో ఈజ్ బార్న్’ సినిమా నుంచి ‘ఓం నమః శివాయ’ అనే లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేయటం చాలా ఆనందంగా ఉంది.
తనకు నచ్చినట్లు బతికే వ్యక్తి జీవిత పరిణామ క్రమంలో ఏం జరిగిందనే కథాంశంతో సినిమాను రూపొందించారు. ఒక అనుభవాన్ని, బాధను దిగమింగుకుని తన ప్రయాణాన్ని కొనసాగించే హీరో గురించి తెలియజేసే క్రమంలో ఈ శివుడి పాట వస్తుంది. కథలో చాలా కీలకమైన ఘట్టంలో పాట వస్తుంది” అన్నారు. దర్శక నిర్మాత వీజే సాగర్ మాట్లాడుతూ.. “సినిమా చిత్రీకరణంతా పూర్తయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. డిఫరెంట్ పాయింట్‌తో తెరకెక్కుతోన్న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్. త్వరలోనే రిలీజ్ డేట్ వివరాలను తెలియజేస్తాం” అన్నారు.