calender_icon.png 28 December, 2024 | 12:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెవెన్యూ డివిజన్ ప్రకటించే వరకు ఉద్యమం ఆగదు

07-11-2024 04:17:57 PM

చేర్యాల (విజయక్రాంతి): చేర్యాల ప్రాంతాన్ని రెవెన్యూ డివిజన్ గా ప్రకటించే వరకు ఉద్యమం ఆగదని ఎస్ఎఫ్ఐ డివిజన్ కార్యదర్శి తాడూరి భరత్ పేర్కొన్నారు. గురువారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే చేర్యాల పట్టణాన్ని రెవెన్యూ డివిజన్ చేస్తామని హామీ నిచ్చింది. అధికారంలోకి వచ్చి 10 నెలలు అవుతున్న ఇప్పటివరకు ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి, రెవెన్యూ డివిజన్ ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. కొందరు నాయకులు వారి శారద ప్రయోజనాల కోసం జేఏసీ పేరిట కాలయాపన చేయడానికి కుట్ర పన్నుతున్నారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే, నాలుగు మండలాల ప్రజలను కలుపుకొని ఐక్య ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాహుల్, సంజయ్, అఖిల్, నరేష్, రాజు తదితరులు పాల్గొన్నారు.