calender_icon.png 5 February, 2025 | 10:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మందకృష్ణ మాదిగతోనే ఉద్యమం సజీవం: ఎమ్మెల్యే కడియం

05-02-2025 01:20:59 AM

హైదరాబాద్, ఫిబ్రవరి 4 (విజయక్రాంతి): మందకృష్ణతోనే దండోర ఉద్యమం సజీవంగా నిలిచిందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి పేర్కొన్నారు.  అన్ని ప్రభుత్వాలు దండోర ఉద్యమానికి మద్దతు ఇచ్చాయని, 30 ఏళ్ల తర్వాత వర్గీకరణ జరుగుతుండటం సంతోషంగా ఉందన్నారు. ఇక కాలయాపన చేయకుండా వర్గీకరణను అమలు చేయాలని కోరారు.

1994 నుంచి ఈరోజు వరకు తాను దండోర ఉద్యమంతో మమేకమయ్యాయన్నారు. ఉమ్మడి ఏపీలో వర్గీకరణ అమలు చేసే ప్రభుత్వంలో తాను మంత్రిగా ఉన్నానన్నారు. ఇప్పుడు తిరిగి అమలవుతున్న సమయంలో తాను అసెంబ్లీ ఉండటంపై ఆనందం వ్యక్తం చేశారు. దళితులందరం అన్నదమ్ములమే అన్నారు.