calender_icon.png 17 January, 2025 | 12:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

52 వేలకు పసిగుడ్డును అమ్మిన తల్లి

11-09-2024 02:18:20 AM

నిర్మల్ జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసిన ఘటన 

తల్లితో సహా పలువురిపై కేసు 

నిర్మల్, సెపెంబర్ 10 (విజయక్రాంతి): పేగు బంధాన్ని కాదనుకున్న తల్లి తన 21రోజుల కొడుకును రూ.52వేలకు అమ్మేసిన ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. నిర్మల్ జిల్లా కడెం మండలంలోని ఓ గిరిజన గ్రామానికి చెందిన ఆత్రం అనిత(21) గత నెలలో బాబుకు జన్మనిచ్చింది. ఏమైందో ఏమోగాని ఆ బిడ్డను విక్రయించేందకు నిర్ణయించుకుంది. అనితకు చిన్నమ్మ అయిన టె కాం రాధతోపాటు బెల్లాల్ గ్రామానికి చెం దిన కొమ్ము గాంగారాం, అతడి భార్య భాగ్య సహకారంతో రూ.52 వేలకు విక్రయించేందకు బేరం కుదుర్చుకున్నది.

జగిత్యాల జిల్లా సారంగపురం మండలంలోని రంగంపేట్‌కు చెందిన బెక్కం రాధ, లక్ష్మిరాజ్యం దంపతులకు పిల్లలు లేకపోవడంతో అనిత బిడ్డను కొనేందుకు ప్రయత్నం చేశారు. బాబుకు 21 రోజుల ఉయ్యాల కార్యక్రమం అనంతరం అ ప్పగించేలా మధ్యవర్తులతో ఒప్పందం చేసుకున్నారు. 21 రోజులు నిండగానే బాబును అప్పగించారు. ఈ విషయం గోప్యంగా ఉం చిన అనిత.. తన కొడుకు కనిపించడం లేద ని, ఎవరో ఎత్తుకపోయారని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకుని దర్యాపు ప్రారంభించారు.

జిల్లా బాలల సరక్షణ అధికారుల సహకారంలో దర్యాప్తు చేపట్టారు. విచారణలో బాబును విక్రయించినట్టు తెలుసుకు న్న అధికారులు మధ్యవర్తులుగా ఉన్న రాధ, గంగారం భాగ్యను అదుపులో తీసుకున్నా రు. ఖానాపూర్ సీఐ, బాలల సంరక్షణ అధికారులు జగిత్యాల జిల్లాకు వెళ్లి బెక్కం రాధ, లక్ష్మిరాజ్యం దంపతుల నుంచి బాబును మంగళవారం తీసుకుని నిర్మల్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. బాబుకు అన్ని రకా లు ఆరోగ్య పరీక్షలు చేసిన వైద్యులు ఆరోగ్య ంగానే ఉన్నట్టు తెలిపారు. కలెక్టర్ అభిలాష అభినవ్ ఆసుపత్రికి వెళ్లి బాబు ఆర్యోగం గురించి తెలుసుకున్నారు.

కాగా తల్లి ఆత్రం అనితతో పాలు మధ్యవర్తులుగా వ్యవహరించిన రాధ గంగారాం, యోగి బాబుతోపాటు బెక్కం రాధ, లక్ష్మిరాజ్యంపై కేసు నమోదు చేసినట్టు ఖానపూర్ పోలీసులు తెలిపారు. ఖానపూర్ సీఐ రవినాయక్, ఎస్సై రవికుమార్ బాలల సంరక్షణ అధికారి మురళిని, ఎస్పీ జానకి షర్మిలను కలెక్టర్ అభిలాష అభినవ్ ప్రత్యేకంగా అభినందించారు.