20-02-2025 04:54:16 PM
ఆదిలాబాద్ (విజయక్రాంతి): ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన కృషి ఎన్నటికీ మరువలేనిదని ఆ పార్టీ శ్రేణులు కొనియాడారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన బిల్లు పార్లమెంటులో ఆమోదం తెలిపిన రోజును పురస్కరించుకొని ఆదిలాబాద్ లో పార్టీ శ్రేణులు గురువారం సంబరాలు జరుపుకున్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో బీ.ఆర్.ఎస్.వి నాయకులు తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసి, పూలమాలలతో అలంకరించారు.