calender_icon.png 4 February, 2025 | 7:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కిటకిటలాడిన చదువుల తల్లి ఒడి

04-02-2025 01:40:32 AM

* బాసరలో వసంత పంచమి సందడి

* 50 వేల మంది చిన్నారుల అక్షరభ్యాసాలు

* పట్టు వస్త్రాలు సమర్పించిన కలెక్టర్ అభిలాష

నిర్మల్,  ఫిబ్రవరి 3 (విజయక్రాంతి)/ బాసర: నిర్మల్ జిల్లా బాసర సరస్వతి అమ్మవారి ఆలయంలో వసంత పంచమి సం  సందడి నెలకొంది. ఈసారి రెండు రోజులపాటు వసంత పంచమి తిథి రావడంతో పెద్దఎత్తున భక్తులు అమ్మవారిని ద  రెండు రోజుల్లోనే సుమారు 50 వేలమంది పిల్లలకు వారి తల్లిదంర్రులు అక్షరభ్యాసం చేయించినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.

తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల నుంచి భక్తులు తరలిచవ్చారు. ఉదయం నాలుగు గంటల నుంచే భక్తులు క్యూలైన్‌లు కట్టారు. బాసర ఆలయం, గోదావరి నది తీరం, స్థానిక రైల్వే స్టేషన్, బస్టాండ్‌లో భక్తుల రద్దీతో

కిటకిటలాడింది. ఉదయం 8 గంటలకే భక్తుల క్యూలైన్ కిలోమీటర్ దాటింది. దీంతో అమ్మవారి దర్శనానికి మూడు గంటలకు పైగా సమయం పట్టింది. భక్తుల కోసం ధర్మదర్శనంలో పాటు ప్రత్యేక దర్శనాల కోసం రూ.100, రూ 1,000 టికెట్ పెట్టడంతో ఆ లైన్‌లు కూడా పెరిగాయి. సాయంత్రం 4 గంటల వరకు రద్దీ కొనసాగింది.

ఉదయం 8 గంటలకే జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అమ్మవారిని దర్శించుకొని పట్టు వస్త్రాలు సర్పించారు. జిల్లా ఎస్పీ జానకీ షర్మిల నేతృత్వంలో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా అవసరమైన చర్యలు చేపట్టారు. తొలి రోజు భక్తులకు ఇబ్బందులు కలిగిన నేపథ్యంలో కలెక్టర్, ఎస్పీల ఆదేశాల మేరకు క్యూలైన్‌లో వేచిఉన్న భక్తులకు తాగునీరు, అరటిపండ్లు అందించారు.

చిన్నారులకు, వృద్ధులకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేసి వీఐపీల తాకిడిని సర్దుబాటు చేశారు. ఏఎస్పీలు రాకేశ్‌మీనా, అవినాష్‌కుమార్, ఉపేందర్‌రెడ్డి, ఆర్డీవో కోమల్‌రెడ్డి, డీపీవో శ్రీనివాస్, ఆలయ ఈవో సుధాకర్, తహసీల్దార్ పవన్ ఏర్పాట్లలో పాల్గొన్నారు.