సెల్లార్‌లో మృతదేహం పాతిన వైనం
రాజేంద్రనగర్, జనవరి 9: కోడల్ని కూతురిలా చూడాల్సిన అత్తామామలే ఆమెను దారుణంగా చంపేశారు. కల్లులో ఎలుకల మందు కలి కడతేర్చారు. మృతదేహాన్ని సెల్లార్ గుంతలో పాతిపెట్టారు. రంగారెడ్డి జిల్లాలో కలకలం సృష్టించిన ఈ ఘటన శంషాబాద్ పీఎస్ పరిధిలో జరిగింది.
పోలీసుల కథనం ప్రకా రామాంజాపూర్ తండాకు చెం ముడావత్ సురేశ్, ముడావత్ ధూలి(38) దంపతులు. గత నవంబర్ 10న దూలి అదృశ్యమవడంతో సురేశ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు.
కల్లులో ఎలుకల మందు..
కోడలు దూలి, అత్త తులసి మధ్య సఖ్యత లేదు. దీంతో ఎలాగైనా కోడలిని చంపాలని అత్త తులసి, మామ అనంతి పథకం వేశారు. తాను పనిచేసే చోట పని ఇప్పిస్తానని నమ్మిం అత్త అనంతి కోడలు దూలిని నవంబర్ 10న సాతంరాయి ప్రాంతానికి తీసుకొచ్చింది. భర్త అనంతితోపాటు మరో వ్యక్తితో కలిసి దూలికి కల్లులో ఎలుకల మందు కలిపిచ్చి, చంపేశారు.
మృతదేహాన్ని నిర్మాణంలో ఉన్న ఓ భవనం సెల్లార్‌లో పూడ్చేశారు. నానమ్మ తులసిపై అనుమానం వ్యక్తం చేసిన ఆమె మనువళ్లు.. పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. పోలీసులు తులసిని అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించగా నేరం అంగీకరించింది.
అనంతరం గురువారం రాజేంద్రనగర్ తహసీల్దార్ బొమ్మరాములు, ఇన్‌స్పెక్టర్ నరేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో జేసీబీల సాయంతో మట్టి తొలగించి దూలి మృతదేహాన్ని వెలికితీశారు. అనంతరం మృతదేహానికి అక్కడే పోస్ట్‌మార్టం నిర్వహించినట్లు తహసిల్దార్ రాములు వెల్లడించారు.